నిఠారి హత్యల కేసులో నిందితులకు మరణ శిక్ష

First Published Dec 8, 2017, 7:02 PM IST
Highlights
  • నిఠారి హత్య కేసులో నిందితులకు మరణ శిక్ష
  • తీర్పు వెలువరించిన ప్రత్యేక న్యాయస్థానం

దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నిఠారీ వరుస హత్యల కేసులో దోషులకు ఘజియాబాద్‌ సిబీఐ ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది.   ఈ కేసులో ప్రధాన నిందితుడిగా వున్న నరరూప రాక్షసుడు సురేంద్ర కోలీతో పాటు నోయిడా వ్యాపారవేత్త మోనిందర్ సింగ్ పాండేర్ సిబిఐ ప్రత్యేక కోర్టు  మరణ శిక్ష విధించింది.  రింపా హల్దార్ అనే 14 ఏళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన కేసులో వీరిద్దరిని దోషులుగా కోర్టు తేల్చింది. అంతేకాకుండా నిఠారీ గ్రామంలో జరిగిన మరో 15 హత్య కేసుల్లో కూడా వీరి ప్రమేయం ఉన్నట్టు సిబిఐ వీరిపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.

అయితే కొఠారి హత్యలకు సంభందించి  మొత్తం 16 కేసులు కోర్టులో పెండింగ్ లో ఉండగా, ఇది తొమ్మిదవ కేసు. అలాగే ఇప్పటివరకు వెలువడిన తీర్పుల్లో ఇద్దరు నిందితులుగా తేలిన వాటిలో ఇది మూడవ కేసు. వీరికి మరణశిక్షను విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించిందని సిబిఐ అధికారి అభిషేక్ దయాల్ తెలిపారు. 

 మానవ మృగం సురేంద్ర కోలీ నోయిడా శివార్లలోని నిఠారీ గ్రామంలో దాదాపై 16 హత్యలు చేసినట్లు సీబిఐ ఇతడిపై కేసులు నమోదు చేసింది. ఈ విషయం అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసుల్లో భాగంగా ఒక బాలిక కేసులో మాత్రమే ఘజియాబాద్ కోర్టు ఇప్పుడు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సురేందర్ సింగ్ కోలీ నేరాన్ని అంగీకరిస్తూ వాంగ్మూలం ఇచ్చాడు. ఇందులో తనకు తన యజమాని పంథర్ సహకరించినట్టు అతడు సీబీఐ అధికారులకు తెలిపాడు. దీనిపై పూర్తి ఆధారాలు సేకరించిన సీబిఐ పకడ్బందీగా వ్యవహరించి నిందితులు తప్పించుకోకుండా శిక్ష పడేలా చేశారు.  
స్థానిక పోలీసులు పండేర్ ఇంటి వెనుకభాగంలో 16 మందికి చెందిన పిల్లలు, ఎక్కువగా పిల్లలను గుర్తించినప్పుడు నితరి హత్యలు బయటపడ్డాయి.

click me!