
ఫిట్‌నెస్ ఛాలెంజ్‌కు దేశవ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. తాజాగా కేంద్రమంత్రులు కూడా దీన్ని ఛాలెంజ్‌గా తీసుకొన తమదైన శైలిలో కసరత్తులు చేసి ఆ వీడియోలను ట్విటర్‌లో ఫాలోవర్స్‌తో పంచుకున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు, రైల్వే మంత్రి పియూశ్ గోయల్, శాస్త్ర, సాంకేతిక, వాతావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్, పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా, మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి యశోధర రాజే సింధియా, పలువురు చట్టసభ సభ్యులు సవాల్‌ను స్వీకరించారు.