ఇంగ్లండు రోడ్డు ప్రమాదంలో ఖమ్మం వాసి మృతి

First Published Oct 4, 2017, 1:39 PM IST
Highlights

స్విండన్ లో  ఒక టాక్సి ఢి కొట్టడంతో  శ్రీధర్ మున్నలూరి మరణించాడు

ఇంగ్లండు లో జరిగిన రోడ్డుప్రమాదంలో ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీధర్ మున్నలూరి  మృతిచెందాడు.ఆయన ఖమ్మం జిల్లా బురంపురంకు చెందినవాడు.  శ్రీధర్ కు భార్య, ఇద్దరు కూతుళ్లున్నారు.  ఒక కూతురి వయసు 5 సంవత్సరాలు కాగా, రెండో కూతురు వయసు 8.  ఆయన ఇంగ్లండులోని  స్విండన్‌  బ్రూనెల్ క్రిసెంట్‌లో ఉంటున్నారు.

స్విండన్‌లో శనివారం ఓ కారు ఢీకొట్టడంతో శ్రీధర్ తీవ్రగాయాలపాలయ్యాడు.అనంతరం  చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ విషయాన్ని స్విండన్ హిందూ దేవాలయ ఛైర్మన్ ప్రదీప్ భరద్వాజ్ స్పష్టం చేశారు. శ్రీధర్ మరణం కమ్యునిటీ సభ్యులకు దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు ప్రదీప్. ఆయన కుటుంబాన్ని అందుకునేందుకు అక్కడి హిందూకమ్యూనిటి ఒక నిధి ఏర్పాటుచేసింది. ఒక్క రోజులోనే 33 వేల బ్రిటన్ పౌండ్లు వసులు అయింది. శ్రీధర్ ఇరుగు పొరుగున మంచి పేరుందని భరద్వాజ్ చెప్పారు. అందువల్ల ఆయన కుటుంబాన్ని ఆదుకోవడం ఇక్కడి హిందవుల బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

శనివారం సాయంకాలం కార్పొరేషన్ స్ట్రీట్ లో ఆయన ఒక టాక్సి ఢీ కొట్టింది. ఆయన వెంటనే సౌత్ మీడ్ హాస్సిటల్ లోని ట్రామా టర్ కు తరలించారు. అయితే ఆయన అదివారం చనిపోయారు.

 

 

మరిన్ని వార్తల కోసం ఇక్కడి క్లిక్ చేయండి

https://goo.gl/dDD13Xhttps://goo.gl/dDD13X

 

 

 

click me!