పిజ్జాని వెనక్కి నెట్టిన.. చిల్లిచికెన్ సమోసా

 |  First Published Dec 28, 2017, 10:59 AM IST
  • చిరుతిండి వంటల పోటీలో టాప్ లో నిలిచిన సమోసా

 ‘‘సమోసా’’ ఈ పదం వినని భారతీయులు ఉండరేమో. ఇండియాలో పాపులర్ స్నాక్ ఐటెమ్ ఇది. సాయంత్రం వేళల్లో అందరూ ఇష్టంగా తినే మన సమోసా దక్షిణాఫ్రికా ప్రజలను కూడా మెప్పించింది. తాజాగా దక్షిణాఫ్రికాలో చిరుతిండి వంటకాల పోటీ పెడితే.. మన కశ్మీరీ చిల్లీ చికెన్‌తో చేసిన సమోసా విజేతగా నిలిచింది.

దక్షిణాఫ్రికాలో భారత కమ్యూనిటీ కోసం నిర్వహించే వీక్లీ పోస్ట్‌ అనే మీడియా సంస్థ ఇటీవల చిరుతిళ్ల పోటీ పెట్టింది. ఇందులో ఛాక్లెట్‌, జీడిపప్పు వంటకాలు, పిజ్జాల లాంటి వాటిని కూడా వెనక్కి నెట్టి మన కశ్మీరీ చిల్లీ చికెన్‌ సమోసా తొలి స్థానంలో నిలిచింది. సల్మా అగ్జే అనే మహిళ ఈ సమోసాను తయారుచేశారు. ఈ పోటీలో తన వంటకం గెలవడం ఆనందంగా ఉందని సల్మా చెప్పారు. తనకు వంట చేయడం చాలా ఇష్టమని.. వంటకాల్లో ఎప్పుడూ ప్రత్యేక రుచి ఉండేలా చూసుకుంటానని చెప్పారు.

Latest Videos

దీంతో పాటు మరో రెండు పోటీలను కూడా నిర్వహించారు. వేగంగా సమోసాలు తయారుచేసే పోటీ పెట్టగా.. అందులో 63ఏళ్ల రోక్సానా నసీమ్‌ అనే మహిళ విజేతగా నిలిచారు. 60 సెకండ్లలో ఆమె 10 సమోసాలను తయారుచేశారు. ఇక వేగంగా సమోసాలు తినే పోటీ పెడితే..ఇబ్రహీం బక్స్‌ అనే వ్యక్తి గెలుపొందాడు. ఆయన ఒక్క నిమిషంలో 10సమోసాలను తినేశాడు.

click me!