కర్ణాటక ఎన్నికలు: బోణీ కొట్టిన బిజెపి, ఉమానాథ్ గెలుపు

First Published May 15, 2018, 9:53 AM IST
Highlights

కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బిజెపి బోణీ కొట్టింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ఫలితం బిజెపికి అనుకూలంగా వచ్చింది. 

బెంగళూరు: కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బిజెపి బోణీ కొట్టింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ఫలితం బిజెపికి అనుకూలంగా వచ్చింది. కోట్యాన్ నియోజకవర్గంలో ఉమానాథ్ విజయం సాధించారు. 

బిజెపి వందకు పైగా సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. 105 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెసు క్రమంగా తన ఆధిక్యతను కోల్పోతూ వస్తోంది. జెడిఎస్ ఊహించినదాని కన్నా ఎక్కువ ఫలితాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

జెడిఎస్ కాంగ్రెసు ఓట్లనే చీల్చినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం జెడిఎస్ 46 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. 

కర్ణాటక శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. మొత్తం 38 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఓట్ల లెక్కింపులో 11 వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలకు 100 మీటర్ల మేర గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 

click me!