విజేత ఎవరో ?

First Published May 15, 2018, 8:15 AM IST
Highlights

విజేత ఎవరో ?

కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రతిష్టాత్మకంగా జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాసేట్లో వెలువడనున్నాయి... ఉత్తర భారతాన్ని కైవసం చేసుకుని, కన్నడను కొల్లగొట్టి, దక్షిణాదిన జెండా పాతాలని భావిస్తున్న బీజేపీ వ్యూహం నెగ్గుతుందా? మళ్లీ అధికారంలోకి వచ్చి చరిత్ర తిరగరాయాలనుకుంటున్న కాంగ్రెస్ ఆశలు ఫలిస్తాయా ?

కాస్తోకూస్తో సీట్లు గెలుచుకొని కింగ్ మేకర్ అయ్యి చక్రం తిప్పాలనుకున్న జేడీఎస్ కల నెరవేరుతుందా ? 

 

ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా... 11 వేల మంది సిబ్బంది ఓట్ల లెక్కింపులో పాల్గొననున్నారు. ప్రతీ కౌంటర్ దగ్గర సుమారు 100 మంది సిబ్బంది పాల్గొననున్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో గట్టి నిఘా ఏర్పాటు చేశారు... బెంగళూరులో ఐదు ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు. ఉదయం 9 గంటల వరకు ట్రెండ్స్ వెల్లడయ్యే అవకాశం ఉండగా... మధ్యాహ్నానికి పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. 224 మొత్తం స్థానాల్లో 222 స్థానాలకు ఎన్నికలు జరగగా... 2,640 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. మొత్తం 4,96,82,357 ఓట్లను లెక్కించేందుకు... 56,696 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. 

click me!