షాక్: బెంగళూరు అపార్టుమెంట్లో 10 వేల ఓటర్ ఐడి కార్డులు

First Published May 9, 2018, 10:38 AM IST
Highlights

బెంగళూరులోని ఓ అపార్టుమెంటులో గురువారం రాత్రి దాదాపు 10 వేల ఓటరు ఐడి కార్డులు బయటపడ్డాయి.

బెంగళూరు: కర్ణాటక ఎన్నికల పోలింగ్ కు పట్టుమని మూడు రోజులు కూడా లేవు. ఈ స్థితిలో విస్తుపోయే విషయం వెలుగు చూసింది. బెంగళూరులోని ఓ అపార్టుమెంటులో గురువారం రాత్రి దాదాపు 10 వేల ఓటరు ఐడి కార్డులు బయటపడ్డాయి.

ఎన్నికల కమిషన్ వాటిని గుర్తించి స్వాధీనం చేసుకుంది. ఈ ఐడి కార్డులతో ఓ కాంగ్రెసు ప్రజాప్రతినిధికి సంబంధం ఉందని అనుమానిస్తున్నారు. రాజరాజేశ్వరి నగర్ ఎన్నికను రద్దు చేయాలని బిజెపి డిమాండ్ చేస్తోంది.

ఆ అపార్టుమెంట్ స్థానిక బిజెపి నాయకుడికి చెందిందని, తప్పుడు సాక్ష్యం సృష్టించి బిజెపి డ్రామా ఆడుతోందని కాంగ్రెసు నాయకులు విమర్శిస్తున్నారు. 

రంగంలోకి దిగిన ఎన్నికల కమిషన్ రంగంలోకి దిగి అర్థరాత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఐడి కార్డులు చిన్న చిన్న ప్యాకెట్లలో కట్టి ఉన్నాయని కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి సంజీవ్ కుమార్ చెప్పారు. 

అపార్టుమెంటు నుంచి ఐదు ల్యాప్ టాప్స్, ఓ ప్రింటర్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరో 24 గంటల్లో అసలు విషయం తెలుస్తుందని, కఠినమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. 

ఆ అపార్టుమెంటు మంజుల నంజమారి పేరు మీద ఉందని, దాన్ని రాకేష్ అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చారని చెప్పారు. మునిరత్నకు ఆ వ్యక్తితో సంబంధం ఉందా లేదా అనేది తెలియదని అన్నారు. ఐడి కార్డుల విషయంపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని కాంగ్రెసు డిమాండ్ చేసింది.

click me!