
ప్రముఖ టెలికాం సంస్థ జియో.. మరో సంచలనానికి తెరలేపుతోంది. జియో త్వరలోనే ‘జియో హోమ్ టీవీ’ పేరిట సరికొత్త సేవలను ప్రారంభించనుందట. అంతేకాదు, అన్ని ఎస్‌డీ(స్టాండర్డ్ డెఫినేషన్) ఛానళ్లను నెలకు రూ.200లకే అందించనుందని సమాచారం. ఇక ఎస్‌డీ+హెచ్‌డీ(హై డెఫినేషన్) ఛానళ్లు రూ.400కే అందిస్తుందని చెబుతున్నారు. ఇదే జరిగితే డీటీహెచ్ రంగంలో సరికొత్త మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ సేవలకు సంబంధించి ఇప్పటికే పనులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. సరికొత్త టెక్నాలజీ ఎన్‌హేన్సడ్ మల్టీమీడియా బ్రాడ్‌కాస్ట్ మల్టీకాస్ట్ సర్వీస్(ఈఎంబీఎంఎస్) ఆధారంగా పనిచేస్తుందని సమాచారం.
పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే సేవలను అందిస్తోందన్న జియో బ్రాడ్‌కాస్ట్ యాప్‌నకు సరికొత్త రూపమే ఈ ‘హోం టీవీ’. ఇటీవల హెచ్‌డీ ఛానళ్లను కూడా పరీక్షించారట. జియో వినియోగదారులందరికీ ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అంతేకాదు త్వరలోనే జియో నుంచి ల్యాప్ టాప్ లు కూడా రానున్నాయి.