కొలంబియాలో జీసస్ ఆకాశ దర్శనం (వీడియో)

First Published Apr 27, 2017, 7:41 AM IST
Highlights

పుట్టెడు శోకంతో ఉన్న పట్టణ వాసులను అనునయించేందుకు  జీసస్ ఇలా శాంకాన్సియో ప‌ర్వ‌తంపైన మేఘాలనుంచి  దర్శనమిచ్చారని ప్రజలు అనుకుంటున్నారు

 

 

 

కొలంబియా లోని మానిజేల్స్ ప్రాంతంలో ఆకాశంలో జేసస్ క్రీస్తు ఆకారంలో  మేఘాలు కనిపించి సంచలనం సృష్టించాయి. ఆకాశంలోని జీసస్‌ దర్శనమిస్తున్నట్లు మేఘాలు మిరమిట్లు గొలిపాయి. త‌మ‌కు అభయం ఇచ్చేందుకు ఇలా  ప్ర‌భువు మానిజేల్స్ ప్రజలకు దర్శనమిచ్చాడని అంతా భావిస్తున్నారు . దీనితో ఈ వీడియో ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గా మారింది. యూరోపియ‌న్ దేశాల్లో ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున చర్చనీయాంశమయింది.

 జీసస్ ఎందుకు కనిపించాడక్కడ?

గ‌త‌వారం మానిజేల్స్ కొండచరియలు కూలడంతో అతలాకుతలం అయింది.  భారీ వ‌ర్షాల కారణంగా కూలిన  ఈ కొండ‌చ‌రియ‌ల కింద పడి 17మంది చ‌నిపోయారు. అయిన వాళ్లను కోల్పోయి పుట్టెడు శోకంతో  ఉన్నవారిని అనునయించేందుకు  జీసస్ ఇలా శాన్కాన్సియో ప‌ర్వ‌తంపైన మేఘాలనుంచి  దర్శనమిచ్చారని ప్రజలు అనుకుంటున్నారు.

 

మొదట భూమ్మీదికొస్తున్నట్లు ఉన్న ఈ ఆకారం చూసి ప్రజలు భ‌య‌ప‌డ్డారు. జాగ్రత్త చూసిన వారు కొందరు, ఈ ఆకారం జీస‌స్‌లా ఉందని గుర్తించారు. అంతే,  ప్ర‌భువు త‌మను కాపాడేందుకు వ‌చ్చాడ‌ని భావించారు. సంబరాలు మొదలుపెట్టారు.

 

మ‌రియా డీ లీస‌స్ అనే మ‌హిళ ఈ మేఘాలలో ఉన్నజీసస్ ను కెమెరాతో రికార్డు చేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇపుడి ది గ్లోబ‌ల్ వైర‌ల్‌గా మారింది. ఇది యేసుక్రీస్తు తిరగివచ్చాడని కామెంట్స్ పెట్టారు. మ‌రికొంద‌రు యేసుక్రీస్తు రెండ‌వ‌రాక కు ఇది హెచ్చరిక అన్నారు.  జీసస్ అని భావించిన చాలా మంది ప్రార్థ‌న‌లు కూడా మొదలుపెట్టారు. వివరాలకు వీడియో చూడండి.

 

 

 

click me!