సీమ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డికి కోపమొచ్చింది

First Published Apr 13, 2018, 12:03 PM IST
Highlights
స్టేట్ బ్యాంక్ కు వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే

అనంతపురం జిల్లాలో పెన్నా నది ఒడ్డున అత్యంత పరిశుభ్రమైన నగరంగా పేరుగాంచింది తాడిపత్రి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని తాడిపత్రిలో పదేళ్ల క్రితమే చేపట్టారు. అక్కడి రోడ్లు, కాలనీలు, ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలు, నివాస ప్రాంతాలు ఇలా ఎక్కడచూసినా పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరుస్తుంది. పదేళ్ల క్రితమే అప్పటి పురపాలక సంఘం ఛైర్మన్ గా వున్న జేసీ ప్రభాకర్ రెడ్డి పచ్చధనం-  పరిశుభ్రత పేరుతో స్వచ్చతా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గతంతో మున్సిపల్ పాలక వర్గం చేపట్టన ఇంటింటా చెత్త సేకరణ కార్యక్రమం కూడా తాడిపత్రిని పరిశుభ్ర పట్టణాల జాబితాలో నిలిచి ఇతర పట్టణాలకు ఇదర్శంగా నిలిచింది. ప్రస్తుత తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి స్వయంగా చెత్తను, కాగితాలను, పేపర్ గ్లాసులను ఎత్తి కుండీలలోకి వేయడం  పలు సందర్భాల్లో మనం చూశాం. అలా ప్రజల్లో మార్పు తీసుకువచ్చి పరిశుభ్రత వైపు నడిపించారు.    
  
ఇలాంటి వ్యక్తి ఎమ్యెల్యేగా వున్న నియోజకవర్గ కేంద్రంలో ఓ  ప్రభుత్వ రంగ బ్యాంకు మాత్రం పరిశుభ్రత పాటించకపోవడంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఏటీఎం కేంద్రం చెత్తా చెదారంగా మారింది. దీంతో స్థానికులు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డికి సమాచారం అందించారు. తాడిపత్రిలో ప్రైవేట్ సంస్థలు కూడా పట్టణ పరిశుభ్రతకు తమవంతు కృషి చేస్తుండగా ఓ ప్రభుత్వ బ్యాంకు ఇలా నిర్లక్ష్యం వహించడంతో ఎమ్మెల్యే కోపోద్రిక్తుడయ్యాడు. నేరుగా ఆ  ఏటీఎం కేంద్రానికి వెళ్లి పరిశీలించిన ఆయన బ్యాంకు సిబ్బందిని హెచ్చరించారు. వేంటనే దీన్ని శుభ్రం చేయాలని లేకుంటే పోలీస్ స్టేషన్ లో కేసు పెడతానని హెచ్చరించారు. చూడాలి ఇకనుంచైనా ఈ బ్యాంకు పరిశుభ్రతను పాటిస్తుందేమో.


 

click me!