టిడిపిలో బాలయ్యే బెస్టయ్యా... జగన్ అన్నాడట

Published : Mar 23, 2017, 08:13 AM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
టిడిపిలో బాలయ్యే బెస్టయ్యా... జగన్ అన్నాడట

సారాంశం

అసెంబ్లీ లాబీల్లో గుస గుస

 

 

ఎక్కడన్నాడోతెలియదు,  బాలయ్య ది బెస్ట్ అని  జగన్ ప్రశింసించాడని అసెంబ్లీలో లాబీల్లో ఈ రోజు ఒక వార్త గుప్పు మనింది.

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరిలో  పనితీరు పరంగా హిందూపూరం ఎమ్మెల్యే  నందమూరి బాలకృష్ణ అలియాస్ బాలయ్య  ది బెస్ట్ అని జగన్ వ్యాఖ్యానించినట్లు సమాచారం.

రూమర్ ప్రకారం,

ఈ రోజు అసెంబ్లీ బయట జగన్ కొంతమంది ఎమ్మెల్యేలతో చ్చాపాటిగా మాట్లాడుతూన్నాడట.

అపుడు  బాలయ్య ప్రస్తావన వచ్చిందట.

అంతే,  ప్రతిపక్ష నాయకుడు ప్రశంసలు కురిపించాడాట.

 

"బాలయ్య ఒకరిని విమర్శించరు. ఒకరి జోలికి రారు.. లేనివి పోనివి మాట్లాడరు.  మాట్లాడినంతవరకు .. మంచి మాటలే మాట్లాడతారు," అని జగన్ కితాబిచ్చినట్లు వైసిపి నేత ఒకరు చెప్పినట్లు తెలుగుదేశం వర్గాలలో ఒక పుకారు షికారు చేస్తూ ఉంది.

 

 తెలుగుదేశం ఎమ్మెల్యేలందరిలోకి బాలయ్యే ది బెస్ట్ అని జగన్ అనడం  చర్చనీయాంశమయింది.

 

నియోజకవర్గంలోని జనాల్లో  ఎమ్మెల్యేగా బాలయ్య పనితీరు ఈ మధ్య కొంత వివాదాస్పదమయింది. ముఖ్యంగా ఆయన రావడం మానేసి, పిఎ ని సామంతరాజు చేశాడని కదా విమర్శ.

 పోనీలే, స్వయంగా ప్రతిపక్ష నేతే బాలయ్యకు ఇలా కితాబివ్వడం విశేషమే.

 

చరిత్రలోకి వెళ్లితే, ఆ మధ్య బాలయ్య,  జగన్ పలుకరించుకున్నారు. మాట్లాడుకున్నారు.

 

వైసిపి నేత భూమన కరుణాకర్రెడ్డి కుమారుడి పెళ్లి సందర్భంగా హైదరాబాద్  జెఆర్ సి సెంటర్ లో  ఇద్దరుకలిశారు.  మొదట చిరునవ్వుతో పలకరించుకున్నారు. తర్వాత కొద్ది సేపు ముచ్చట్లాడుకున్నారు.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !