ఇండియాకు ఇవాంకా దీపావళి శుభాకాంక్షలు

Published : Oct 19, 2017, 01:56 PM ISTUpdated : Mar 25, 2018, 11:48 PM IST
ఇండియాకు ఇవాంకా దీపావళి శుభాకాంక్షలు

సారాంశం

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఇవాంకా ట్రంప్ త్వరలో హైదరాబాద్ రానున్న ఇవాంకా

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఆయన వ్యక్తిగత సలహాదారు ఇవాంకా ట్రంప్.. భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.  నవంబర్ 28న హైదరాబాద్ లో  గ్లోబల్ ఎంట్రపెన్యూర్ షిప్ సమ్మిట్ జరగనున్న సంగతి తెలిసిందే.

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇవాంకా హైదరాబాద్ రానున్నారు. ఈ నేపథ్యంలో ఆమె దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు, జైనులు, సిక్కలు దీపావళి పర్వదినాన్ని ఎంతో ఆనందగా జరుపుకోవాలని, అందరికీ తన దీపావళి శుభాకాంక్షలు అంటూ ఇవాంకా ట్వీట్ చేశారు. అంతేకాకుండా తాను హైదరాబాద్ లో  త్వరలో జరగనున్న జీఈఎస్ 2017 సమ్మిట్ కి హాజరవ్వడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. వైట్ హౌజ్ లో దీపం వెలిగించిన ఫోటో ఒక దానిని ఆమె ట్వీట్ చేశారు. ఆ ఫోటోలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !