అతిగా ఊహించుకుంటోందా?

Published : Nov 09, 2017, 02:04 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
అతిగా ఊహించుకుంటోందా?

సారాంశం

త్వరలో టీడీపీలో చేరనున్న వాణి రోజాపై పోటీకి సై అంటున్న వాణి విశ్వనాథ్

‘‘నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను’’

 ‘‘పది మంది రోజాలు వచ్చినా సరే.. నేను పోటీకి సై’’.

ఈ మాటలు అంటోంది ఎవరో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఆమె సినీ నటి వాణి విశ్వనాథ్. సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన వాణి.. ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. మరి ఆమెకి రోజాతో పోటీ ఏమిటా అనుకుంటున్నారా?

అసలు విషయం ఏమిటంటే.. ‘వాణి విశ్వనాథ్’.. ప్రస్తుతం  టీడీపీ వర్గాల్లో బాగా నానుతున్న పేరు. ఆమె ఒకప్పుడు సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించిన అలనాటి అందాల తార. ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి ఉర్రూతలూగుతోంది. కొద్దిరోజుల క్రితమే..తాను టీడీపీలో చేరనున్నట్లు కూడా ప్రకటించింది.

తాను టీడీపీలో చేరుతున్నట్లు  వాణి  ప్రకటించగానే.. వైసీపీలో రోజాకి ధీటుగా వాణి నిలవబోతోదంటూ కథనాలు ప్రసారమయ్యాయి.. టీడీపీ వర్గాలు కూడా ఇదే విషయం చర్చించుకుంటున్నట్లు సమాచారం. అయితే.. వాణి తీరు చూస్తుంటే.. ‘‘ ఆలు లేదు.. చూలు లేదు కొడుకు పేరు సోమలింగం’’ అన్న చందంగా ఉంది. ఎందుకంటే.. ఇప్పటివరకు ఆమె పార్టీలో చేరలేదు.. చంద్రబాబు ఆహ్వానించనూ లేదు. ఒక వేళ చేరినా.. సీటు ఇస్తారనే గ్యారెంటీ కూడా లేదు. కానీ అంతలోనే తాను రోజా మీద పోటీకి దిగుతానని ప్రకటించేస్తోంది.రోజా అసలు తనకు పోటీనే కాదు అన్నట్టు మాట్లాడుతోంది.

ఈ విషయం పక్కన పెడితే.. వాణి కి రాజకీయాలు కొత్త. ఆమె సినీ రంగంలో సీనియర్ నటి అయ్యి ఉండొచ్చు. కానీ రాజకీయాల్లో రోజాకి ఉన్న అనుభవం ఆమెకి లేదన్న మాట వాస్తవం. అంతేకాకుండా రోజా పార్టీ గళాన్ని ప్రతిసారీ వినిపిస్తూనే ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆమె పర్యటిస్తున్నారు. పార్టీతోపాటు.. పాలన నిర్వహణ పట్ల ఆమెకు పూర్తి స్థాయిలో అవగాహన కూడా ఉంది.

అప్పుడప్పుడు సినిమాల్లో, టీవీ షోల్లో కనిపించినా.. ఆమె పూర్తి స్థాయి రాజకీయనాయకురాలనే చెప్పవచ్చు. అలాంటి రోజాకి.. వాణి నిజంగా పోటీ ఇవ్వగలదా? పోటీకి నిలబడినా... రోజా ధాటికి తట్టుకోగలదా? అనే సందేహాలు మొదలౌతున్నాయి. రోజా మాట్లాడటం మొదలుపెడితే.. చాలా మందికి మాటలు రావు. వాణికేమో అసలు తెలుగు మాట్లాడటమే సరిగా రాదు. అలాంటి వాణి రోజాకి పోటీ ఇవ్వగలరా? ఇద్దరూ సినీ తారలే కాబట్టి.. ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu