అన్ని రైల్వే స్టేషన్లలో ఉచిత ‘‘వైఫై’’

First Published Jan 8, 2018, 11:03 AM IST
Highlights
  • వచ్చే ఏడాది మార్చికల్లా మొత్తం 8,500 స్టేషన్లలో ఏర్పాటు..
  •  గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణీకులతోపాటు ప్రజలకూ ఉచిత ఇంటర్నెట్

భారత్ లోని అన్ని రైల్వే స్టేషన్లలో త్వరలో వైఫై అందుబాటులోకి రానుంది. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 8,500 రైల్వే స్టేషన్లలో వైఫై సేవలు అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రూ.700కోట్లు  ఖర్చు చేయనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి తెలిపారు. వచ్చే ఏడాది మార్చికల్లా మొత్తం వైఫై స్టేషన్లే ఉండాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్న రైల్వే శాఖ.. ఈ ఏడాది మార్చినాటికి 600 స్టేషన్లను టార్గెట్‌గా పెట్టుకున్నట్లు చెప్పారు.

కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తలపెట్టిన ప్రతిష్టాత్మక డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 216 ప్రధాన స్టేషన్లలో రైల్వే శాఖ వైఫై సౌకర్యాన్ని కల్పించిన విషయం తెలిసిందే. దీనివల్ల 70 లక్షల ప్రయాణీకులు ఉచితంగా ఇంటర్నెట్‌ను వినియోగించుకోగలుగుతున్నారు. ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ వినియోగం అత్యవసరమైందని.. అలాంటి సౌకర్యాన్ని మేము దేశంలోగల అన్ని రైల్వే స్టేషన్లలో అందించనున్నాం అని రైల్వే మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 1,200 స్టేషన్లలో మాత్రం కేవలం ప్రయాణికులు మాత్రమే వైఫై ని వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా.. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోగల సుమారు 7,300 స్టేషన్లలో మాత్రం అటు ప్రయాణీకులకు, ఇటు స్థానిక ప్రజలకు ఉపయోగపడేలా వైఫైని అందుబాటులోకి తీసుకురానుండటం గమనార్హం.

click me!