మనమ్మాయిని ఈ అమెరికన్ ఎలా బెదిరిస్తున్నాడో చూడండి..

Published : Mar 02, 2017, 12:22 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
మనమ్మాయిని ఈ అమెరికన్ ఎలా బెదిరిస్తున్నాడో చూడండి..

సారాంశం

న్యూయార్క్ లోకల్ ట్రెయిన్ లో ప్రయాణిస్తున్న భారతసంతతి మహిళ ఏక్తా దేశాయ్ ను అడ్డగించిన ఓ అమెరికన్ ఆమెను అసభ్యపదజాలంతో దూషించడం మొదలుపెట్టాడు.

అమెరికా అధ్యక్ష పీఠంపై ట్రంప్ కొలువుదీరిన తర్వాత అక్కడ భారతీయులపై అరాచకాలు పెరుగుతున్నాయి.

ఆ మధ్య ఓ భారతీయమహిళను వేధించారు. మూడు రోజుల కిందట హైదరాబాద్ కు చెందిన కూచిభొట్ల శ్రీనివాస్ ను జాతివివక్షతతో ఓ అమెరికన్ పొట్టనబెట్టుకున్నాడు.

ఈ వార్త మరవకముందే ఓ భారతీయమహిళను ఘోరంగా అవమానిస్తున్న వీడియో ఒకటి బయట పడింది.

న్యూయార్క్ లోకల్ ట్రెయిన్ లో ప్రయాణిస్తున్న భారతసంతతి మహిళ ఏక్తా దేశాయ్ ను అడ్డగించిన ఓ అమెరికన్ ఆమెను అసభ్యపదజాలంతో దూషించడం మొదలుపెట్టాడు.

మీరంతా ఈ దేశానికి ఎందుకు వచ్చారు. మీ దేశానికి వెళ్లిపోండి అంటూ బూతులు తిట్టాడు. ఈ తంతంగాన్నంతా ఏక్తా ఫేస్ బుక్ లైవ్ చాట్ లో రికార్డు చేసింది.

ఆ విషయం తెలిసినా పట్టించుకోకుండా అతడు బెదిరిస్తూనే ఉన్నాడు. తోటి ప్రయాణికులు కూడా ఈ ఘటనను అడ్డుకోకుండా మిన్నకుండిపోవడం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !