మనం అమెరికా కంటే పాక్ వైపే ఎక్కువట

Published : Mar 08, 2017, 11:34 AM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
మనం అమెరికా కంటే పాక్ వైపే ఎక్కువట

సారాంశం

ప్రపంచ ప్రఖ్యాత ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ ఇటీవల భారతీయుల వలసపై అధ్యాయనం చేసి ఓ నివేదికను బయటపెట్టింది.

దేశంలోని మేధావులంతా అమెరికాకు క్యూ కడుతున్నారు. యూఎస్ లోని ప్రతీ రంగంలో మనోళ్లదే హవా. అక్కడ ప్రతి పది మందిలో ముగ్గరు మనోళ్లే అని తెగ గొప్పలు చెబుతుంటాం.

 

అయితే మనం ఎక్కువగా వలస వెళ్లుతున్నది అమెరికాకు కాదు పాకిస్తాన్ కు  అని ఓ సంస్థ సర్వే చేసి మరీ చెబుతోంది.

 

ప్రపంచ ప్రఖ్యాత ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ ఇటీవల భారతీయుల వలసపై అధ్యాయనం చేసి ఓ నివేదికను బయటపెట్టింది.

 

దీని ప్రకారం మన దేశం నుంచి అత్యధికంగా వలసవెళుతున్నది అరబ్ దేశాలకేనట. ఆ తర్వాత పాకిస్థాన్, తర్వాత స్థానాల్లో అమెరికా ఉందట.

 

భారత్ నుంచి సౌదీకి వలసవెళుతున్నవారి సంఖ్య 35 లక్షలు ఉంటే, అదే పాక్ లో ఉన్న మనవాళ్ల సంఖ్య 20 లక్షలకు పైగా ఉందట.

 

ఇక అమెరికాలో మన వాళ్లు 18 లక్షలకు పైనే ఉంటారని అంచనా వేసింది.

 

అలాగే, భారత్ లో కూడా చాలా దేశాల వాళ్లు వలసదారులుగా ఉన్నారని ఈ సంస్థ తన నివేదికలో స్పష్టం చేసింది.

 

మన దేశంలో అత్యధికంగా వలసవచ్చిన వారిలో బంగ్లాదేశ్ అగ్రస్థానంలో ఉండగా,  తర్వాత స్థానాలలో పాకిస్థాన్ , నేపాల్, శ్రీలంక ఉన్నట్లు ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్రకటించింది.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !