విశాఖ క్రికెట్ స్టేడియం హౌస్ ఫుల్...

First Published Dec 14, 2017, 5:30 PM IST
Highlights
  • ఆసక్తిగా మారిన ఇండియా-శ్రీలంక మూడో వన్డే

విశాఖపట్నంలో క్రికెట్ సందడి మొదలైంది. భారత్-శ్రీలంక మధ్య మూడో వన్డే విశాఖ నగరంలో  జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే రెండు మ్యాచ్ లు జరగగా.. ఒకటి శ్రీలంక, మరొకటి భారత్ గెలిపొందాయి. కాగా.. ఈ మూడో వన్డే కీలకంగా మారింది. దీంతో మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి పెరిగింది.

మ్యాచ్ కి ఇంకా రెండు రోజుల సమయమే ఉండటంతో నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మ్యాచ్ ని తిలకించేందుకు అభిమానులు ఉత్సాహం చూపిస్తున్నారు.  ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం, మద్దిలపాలెంలోని ఎస్ ఎస్ ఎస్ బేకరి వద్ద టికెట్ల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ఇప్పటికే టికెట్ల విక్రయం దాదాపు పూర్తయ్యింది.

బుధవారం వరకు కేవలం రూ.500టికెట్లు మాత్రమే కొనుగోలు చేసిన క్రికెట్ ప్రియులు.. ఇప్పుడు ఇతర టికెట్లను కూడా కొనుగోలు చేస్తున్నారు. గురువారం టికెట్ల విక్రయం మొదలుపెట్టిన కాసేపటికే రూ.1200 టికెట్లు పూర్తిగా అయిపోయాయి. రూ.1800, రూ.2,500,రూ.3,500 టికెట్లు కూడా 80శాతం అమ్ముడయ్యాయి. తొలిసారిగా ఆన్ లైన్ టికెట్ల విక్రయాన్ని కూడా మొదలుపెట్టారు. టికెట్ల విక్రయాన్ని బట్టి... స్టేడియం మొత్తం అభిమానులతో నిండిపోతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఇరు జట్టు సభ్యులు విశాఖ నగరానికి చేరుకున్నారు.

click me!