ఆ సమస్యతో బాధపడుతున్నారా..? అయితే చేపలు తినాల్సిందే.

First Published Dec 19, 2017, 11:13 AM IST
Highlights
  • అన్ని రకాల చేపల్లోనూ ఒమేగా3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి.

మనం రోజువారీ తీసుకునే ఆహారంలో చేపలు కూడా భాగమే. ముఖ్యంగా కోస్టల్ ఏరియాలో ఉండే వారు అయితే.. ఎక్కువగా చేపలను ఆహారంగా తీసుకుంటారు. అన్ని రకాల నాన్ వెజ్ ఫుడ్స్ లోనూ చేపలు ది బెస్ట్ అంటున్నారు నిపుణులు. చేపల్లో చాలా రకాల పోషకపదార్థాలు ఉంటాయి. ముఖ్యంగా అన్ని రకాల చేపల్లోనూ ఒమేగా3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి మానవ శరీరానికి చాలా మేలు చేస్తాయి. ఇవి ఇన్ బుల్ట్ గా మన శరీరంలో ఉండవు. ఇవి కావాలంటే కచ్చితంగా మనం చేపలు తినాల్సిందే. అంతేకాదు.. చేపల్లో బీ12 విటమిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. చేపలు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఎంటో చూద్దాం..

చేపల్లో కొలిస్ట్రాల్ తక్కువ..

చేపలు తింటే లావు అయిపోతామేమో అనే బెంగపడాల్సిన అవసరం లేదు. ఎంత ఎక్కువగా తిన్నా పర్లేదు అంటున్నారు వైద్యులు. ఎందుకంటే.. వీటిలో కొలిస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటుంది. నిజంగా బరువు తగ్గాలనుకునే వారు చేపలను కచ్చితంగా తినాలి. అంతేకాదు.. లీన్ ప్రోటీన్స్.. చేపల్లో చాలా ఎక్కువగా ఉంటాయి.

మైక్రో న్యూట్రీన్స్ ఎక్కువ..

సోడియం, మెగ్నీషియం, పొటాషియం లాంటి మైక్రో న్యూట్రీన్స్ .. చేపల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

హార్ట్ ఎటాక్..

గుండె సంబంధిత వ్యాధులు.. ముఖ్యంగా హార్ట్ ఎటాక్ లాంటివి రాకుండా ఉండాలంటే.. చేపలు తినాలి అంటున్నారు వైద్యులు. చేపల్లోని ఒమేగా3 ఫ్యాటీ ఆమ్లాలు ఇందుకు దోహదపడతాయి.

ప్రశాంతమైన నిద్ర..

నిద్రలేమితో బాధపడుతున్నారా..? అయితే కచ్చితంగా చేపలు తినాలంటున్నారు నిపుణులు. చేపలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ప్రశాంతంగా నిద్రోపోగలరు. ఇందులో ఉండే విటమిన్ డీ అందుకు సహాయపడుతుంది.

కళ్లు ఆరోగ్యంగా..ఉండటానికి కూడా చేపలు బాగా పనిచేస్తాయి. కళ్లు అందంగా ఉండటానికి కూడా చేపల్లోని ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు సహాయపడతాయంటున్నారు నిపుణులు.

click me!