ఐఏఎస్ ల.. ప్రేమ... పెళ్లి... కథ

First Published Nov 30, 2016, 3:34 PM IST
Highlights
  • రూ.500 లతో కోర్టులో పెళ్లి చేసుకున్న ఓ కలెక్టర్ జంట
  • మతం అడ్డుగోడని బద్దలుకొట్టిన మరో ‘సివిల్స్’ కపుల్

 

ఒకరి పెళ్లికి నోట్ల రద్దు అడ్డు వచ్చింది.. మరొకరి ప్రేమకు మతం అడ్డొచ్చింది. సామాన్యులైతే దాన్నో పెద్ద సమస్యగా బాధపడేవారు. కానీ వారు భారత అత్యున్నత సర్వీసుకు చెందిన అధికారులు. ప్రభుత్వ పాలనకు మూలస్తంభాలు. అందుకే అందరిలా వాటిని సమస్యగా ఫీలవలేదు. స్మార్ట్ గా వాటిని సాల్వ్ చేసుకున్నారు.

ఇంతకీ అసలు విషయానికి వస్తే...

 

సివిల్స్‑ 2015 టాప్‌ ర్యాంకర్‌ టీనా దాబీ, సెకండ్ ర్యాంకర్‌ అతహార్‌ ఆమిర్‌ ఉల్‌ షపీ ఖాన్‌లు ప్రేమలో పడ్డారు. అయితే టీనా హిందూమతస్తురాలైతే, అతహార్ జమ్మూకు  చెందిన ముస్లిం. ఇదే వీరు పెళ్లి పీఠలు ఎక్కడానికి అడ్డుగా నిలిచింది.

 

సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన వారి ప్రేమ కథ ఎందుకో మరి హిందూత్వ సంస్థలకు నచ్చలేదు. ఇదంతా లవ్ జిహాద్ లో భాగం అంటూ ఆఖిల భారతీయ హిందూ మహాసభ జాతీయ కార్యదర్శి మున్నా కుమార్‌ శర్మ .. టీనా తండ్రికి ఓ లేఖ రాశారు. వెంటనే మీ కుమార్తెను పద్దతి మార్చుకోమని చెప్పండి అని సలహా కూడా ఇచ్చారు. లేదంటే ఖాన్‌ను మతం మార్చుకునేందుకు ఒప్పించాలని సూచించారు.

 

కానీ, ఈ విషయాన్ని ఆ ఐఏస్ ప్రేమ జంట, వారి కుటుంబ సభ్యులు లైట్ గానే తీసుకున్నారు. త్వరలోనే రెండు మతాల పద్దతుల ప్రకారం పెళ్లి చేసుకొని అన్ని మతాలను గౌరవిస్తామని ఈ  సివిల్స్ జంట ప్రకటించింది.

 

మరో కలెక్టర్ జంట  కూడా ఇలాగే తమ సమస్యను సులువుగా పరిష్కరించుకుంది. పెద్ద నోట్ల రద్దు వల్ల తమ పెళ్లి కి ఇబ్బందులు కలగకూడదనుకుంది.

 

అతి తక్కువ ఖర్చుతో వివాహం చేసుకుని అందరికి ఆదర్శంగా నిలిచింది. గోహాడ్‌‑ సబ్ డివిజినల్ మేజిస్టేట్‌ ఆశిష్ వశిష్ట,  విజయవాడు సబ్ డివిజినల్ మేజిస్టేట్‌ సలోని సిదానాలు ప్రేమించుకున్నారు.  

 

నోట్ల ఇబ్బందులు ఉన్నా కోట్ల రూపాయాలు వెచ్చించి వివాహాలు చేసుకుంటున్న సమయంలో ఈ జంట కేవలంరూ. 500తో వివాహం చేసుకుంది. ఆ ఐదు వందల రూపాయలు కూడా  కోర్టు ఫీజులకే చెల్లించారు.

 

click me!