నేను దేవుడిని.. ఆఫీసుకి రాను..

First Published May 19, 2018, 10:50 AM IST
Highlights

విష్ణుమూర్తి పదో అవతారం నేను.. ఆఫీసుకి వచ్చి టైమ్ వేస్ట్ చేయాలా..?

గుజరాత్ లో ఓ ఉద్యోగి.. ఉన్నతాధికారులకు షాకిచ్చాడు. ఆఫీసుకి ఎందుకు రావడం లేదు అని అడిగితే.. తాను దేవుడిని అని.. తపస్సు చేసుకోవాలని.. ఆఫీసుకి రాను అంటూ వింత సమాధానాలు చెబుతున్నారు. ఈ వింత దేవుడి కథేంటో మనమూ ఓసారి చూసేద్దామా..

పూర్తి వివరాల్లోకి వెళితే.. అతని పేరు రమేష్ చంద్ర. సర్దార్ సరోవర్ ప్రాజెక్టులో సూపరింటెండింగ్ ఇంజినీరుగా పనిచేస్తున్నారు. అయితే.. ఆయన కొంతకాలంగా ఆఫీసుకు రావడం మానేశాడు. ఇంట్లోనే కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాడు. దీంతో ఉన్నతాధికారులు ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కాగా.. ఆయన సమాధానం చూసి షాకవ్వడం అందరి వంతు అయ్యింది. నేను ఆఫీసుకొచ్చి సమయం వృథా చేయాలా? లేదంటే ఈ దేశం కరువు బారిన పడకుండా చూడాలా? అని సర్దార్ సరోవర్ రీహబిలిటేషన్ అండ్ రీసెటిల్‌మెంట్ ఏజెన్సీ పంపిన షోకాజ్ నోటీస్‌కు రమేష్ చంద్ర సమాధానం ఇచ్చాడు. 

‘‘గత ఏడాది సెప్టెంబర్ 22న మీరు డ్యూటీలో చేరారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన మీరు ఎవరి అనుమతి లేకుండా సెలవు పెట్టారు. దీంతో సరోవర్ ప్రాజెక్ట్ పునరావస పనులకు ఆటంకం కలుగుతోంది. మీరు విధులకు హాజరు కాకపోవడంతో కింది స్థాయి ఉద్యోగులకు దిశానిర్దేశం చేసేవారు లేకుండా పోతున్నారు. మీరు తగిన సమాధానం చెప్పకపోతే.. మీపై చర్యలు తీసుకుంటాం’’ అని షోకాజ్ నోటీస్ పంపారు. 
‘‘నేను విష్ణమూర్తి పదో అవతారాన్ని. ధ్యానం చేసుకుంటూ మరో లోకంలో విహరిస్తున్నా. ఆఫీసుకొచ్చి ఈ పని చేయలేను. శారీరకంగా ఆఫీసులో ఉండలేను. దుష్ట శక్తులు వర్షాలను ఆపాలని చూస్తున్నాయి. నేను జగదాంబ భక్తుణ్ని. నా ప్రార్థనలు కరువు బారి నుంచి గుజరాత్‌ను కాపాడతాయి’’ అంటూ రమేష్ చంద్ర బదులిచ్చాడు.


రమేష్‌చంద్ర ఇచ్చిన ఆన్సర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మీరు నన్ను నమ్మకపోయినా, నేనే విష్ణువు 10వ అవతారమని, రాబోయే రోజుల్లో దాన్ని ప్రూవ్ చేస్తానని ఆ ఉద్యోగి తెలిపాడు. 2010లోనే తాను కల్కి అన్న వాస్తవాన్ని గ్రహించానని, తనకు దివ్య శక్తులు ఉన్నాయని చెబుతున్నాడు. అంతేకాదు.. ఈయనకు పిచ్చి బాగా ముదిరినట్టుంది.. కన్న కొడుకులను కూడా రాక్షసులుగా సంభోధించడం గమనార్హం. 

click me!