ఈ యువతి...పోలీసులకు చుక్కలు చూపించింది

First Published Jan 17, 2018, 11:47 AM IST
Highlights
  • మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కిన యువతి
  • పోలీసులకు చిక్కకుండా పారిపోయేందుకు యత్నం
  • వెంబడించి పట్టుకున్న పోలీసులు

మోతాదుకి మించి మద్యం తాగి.. వాహనం నడుపుతూ పట్టుబడిన ఓ యువతి పోలీసులకు చుక్కలు చూపించింది. పోలీసులకు దొరకకుండా పారిపోయేందుకు ప్రయత్నించింది. ఆమెను పట్టుకొనేందుకు పోలీసులు నానా యాతన పడ్డారు. ఈ ఘటన జరిగింది మరెక్కడో కాదు హైదరాబాద్ నగరంలోనే.

వివరాల్లోకి వెళితే.. ఈ మధ్యకాలంలో యువత మద్యం అతిగా సేవించి వాహనాలు నడుపుతూ.. ప్రమాదాలకు కారకులౌతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు నగరవ్యాప్తంగా గస్తీ పెంచారు. ఇందులో భాగంగానే మంగళవారం సాయంత్రం పోలీసులు జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.

 ఈ తనిఖీల్లో ఓ యువతి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది. బ్రీత్ ఎనలైజర్ లో గాలి ఊదడానికి కూడా చాలా సేపు పోలీసులకు సహకరించలేదు. అంతేకాదు.. కారు దిగమని పోలీసులు అడిగినప్పటికీ దిగకుండా పరేషాన్ చేసింది. పోలీసులకు దొరకకుండా పారిపోయేందుకు కూడా ప్రయత్నించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆమె కారును వెంబడించి మరీ పట్టుకున్నారు. ఎట్టకేలకే బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేయగా.. మద్యం అధిక మోతాదులో సేవించినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ఆమె కారును అధికారులు స్వాధీనం చేసుకోగా..ఆ యువతి ఆమె మిత్రుల వాహనంలో ఇంటికి వెళ్లింది. యువతితోపాటు మొత్తం 59 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 34కార్లు,25 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

click me!