బిర్యానీ పరీక్షలో 'హైదరాబాద్' ఫెయిల్

Published : Mar 09, 2017, 09:44 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
బిర్యానీ పరీక్షలో 'హైదరాబాద్'   ఫెయిల్

సారాంశం

హైదరాబాదీ చారిత్రాకాధారాలు చూపించడంలో  దరఖాస్తుదారు విఫలం

హైదరాబాద్ అంటే కొందరికి చార్మినార్, మరికొందరికి హైటెక్ సిటి,ఇంకొందరికి ముత్యాలు... అయితే, అందరికి హైదరాబాద్ అంటే ఏకాభిప్రాయం ఉండేది ఒకే విషయంలో అది బిర్యానీ.

 

పైకి ఎన్ని గుర్తులు హైదరాబాద్ లో వచ్చినా, హైదరాబాద్ సారాంశం అంతిమంగా బిర్యానీయే.

 

ఇండియాలో ఏ వూర్లోనైనా బిర్యానీ అమ్మాలి అంటే దానికి అనధికారికంగా జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ (జీఐ) ట్యాగ్‌ ‘హైదరాబాద్’ గిలించాల్సిందే.

 

అయితే, తమాషా ఏమంటో, మాకు జిఐ ట్యాగ్ ఇవ్వండి  అని దక్కన్ బిర్యానీ తయారీదారులసంఘం అధికారులను కోరాల్సి వచ్చింది.. ఈ సంఘం ఎపుడో 2009లోనే  దరఖాస్తు చేసి ట్యాగ్ కోసం ప్రయత్నిస్తూ ఉంది.  జిఐ రిజిస్ట్రీ అధికారులు కాదుపొమ్మన్నారు. కారణం, (ఇప్పటి) బిర్యానీ పుట్టినిల్లు హైదరాబాద్ అని ప్రపంచమంతా నమ్మినా,  దానికి చారిత్రాకాధారాలు చూపించడంలో వీళ్లు ఫెయిలయ్యారు. అందుకే హైదరాబా ద్ బిర్యానికి ‘ హైదరాబాద్ ట్యాగ్’  రావటం కఫ్టంగా ఉంది.

 

ఈ బిర్యానీ దక్కన్ దండయాత్ర సమయంలో మొగల్ సైనికులు హైదరాబాద్ కు పరిచయం చేశారట. తర్వాత నిజాం రాజులు దానిని బాగా ప్రమోట్ చేశారు. ఉత్తరాదినుంచి దక్షిణాది కొచ్చినా,  దక్కన్ సుగంధ ద్రవ్యాలన్నీ కలుపుకుని బిర్యానీ ఏకంగా గత వాసన విడిచేసి హైదరాబాదీ అయిపోయింది.

 

అయితే, జిఐ రిజస్ట్రీ ప్రమాణాలు అందుకో లేక పోయిందని 2009 దరఖాస్తును తిరస్కరించారు.తర్వాత  2013లో మరొక దరఖాస్తు చేశారు. అపైన 2016లోకొత్త నియమాల ప్రకారం మరొక ప్రయత్నం చేశారు. అయితే, 2017 జనవరిలో రిజిస్ట్రీ ఒక నోటీసును అసోషియేషన్ కు పంపింది. దానికి అసోసియేషన్ నుంచి స్పందన లేకపోవడంతో అధికారులు ‘దరఖాస్తు వీగిపోయింది’ అని ప్రకటించేశారు.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !