NEWS
ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ను ఎక్కడో పెట్టి మరిచిపోయారా? లేదా ఎవరైనా దొంగిలించారా? బాధపడాల్సిన అవసరం లేదు. ఈజీగా ఫోన్ ని కనిపెట్టేయచ్చు. ఎలా కనిపెట్టాలో ఇప్పుడు చూద్దాం..
గూగుల్ సహాయంతో మనం పోయిన మన ఆండ్రాయిడ్ ఫోన్ ని సులభంగా కనిపెట్టవచ్చు. దాదాపు ఇప్పుడు అన్ని ఫోన్ లలో ‘‘ఫైండ్ మై డివైస్’’ అనే ఆప్షన్ ని అందుబాటులో ఉంచుతున్నారు. దీని సహాయంతో పోయిన ఫోన్ ఎక్కడున్నా ఈజీగా ట్రాక్ చేయవచ్చు. అయితే.. దీనికి ముందు మీరు ఫోన్ కొనగానే మీ ఫోన్ లో ‘‘ ఫైండ్ మై డివైస్’’ అనే ఆప్షన్ ని ఎనేబుల్ చేసుకోవాలి.
ముందుగా సెట్టింగ్స్ లోకి వెళ్లి సెక్యురిటీ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి. అందులో డివైస్ అడ్మినిస్ట్రేషన్ ని ఎంచుకోవాలి. అందులో ‘‘ఫైండ్ మై డివైస్’’ అనే ఆప్షన్ కనపడుతుంది. దాని పక్కన చెక్ బాక్స్ కనపడుతుంది. దానిని టిక్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఫైండ్ మై డివైస్ అనే ఆప్షన్ ని ఎనేబుల్ చేసుకున్నట్టే. ఆ తర్వాత బ్యాక్ వచ్చి మళ్లీ సెట్టింగ్స్ వద్దకు రావాలి. అందులో లొకేష్ అనే ఆప్షన్ ఎంచుకొని టర్న్ ఆన్ చేయాలి. తర్వాత గూగుల్ లొకేషన్ హిస్టరీ దగ్గరికి వెళ్లి.. లొకేషన్ హిస్టరీని సెలక్ట్ చేయాలి. అప్పుడు యువర్ డివైజ్ అనే ఆప్షన్ ఆన్ అవుతుంది.ఇలా ముందుగా చేసుకొని ఉంటే ఫోన్ కనుక్కోవడం చాలా సులువు.
ఇప్పుడు మీ ఫోన్ పోయిందనుకుందాం.. దానిని ఎలా కనుగొనాలో ఇప్పుడు చూద్దాం.. మీ ఫోన్లో గతంలో రిజిస్టర్ చేసుకున్న గూగుల్ (జీమెయిల్) అకౌంట్లోకి లాగిన్ అవ్వండి. గూగుల్ సెర్చ్ హోం పేజీకి వెళ్లి ‘వేర్ ఈజ్ మై ఫోన్?’ అని టైప్ చేయండి. గూగుల్ మ్యాపు, మ్యాపుపై బాక్స్ కనిపిస్తుంది. బాక్స్‌లో ‘లొకేట్ ఫోన్’ ఆప్షన్‌ను ఎంచుకోండి. మ్యాపుపై మీ ఫోన్ ఉన్న లొకేషన్ కనిపిస్తుంది. ‘రింగ్’ ఆప్షన్‌ను ఎంచుకోండి. మీ ఫోన్ సైలెంట్లో ఉన్నా పూర్తి వాల్యూమ్‌తో 5 నిమిషాలు మోగుతుంది. బాక్స్‌లోని ‘ఎనేబుల్ లాక్ అండ్ ఎరేజ్’ ఆప్షన్‌ను ఎంచుకుని కొత్త పాస్వర్డ్ కూడా పెట్టుకోవచ్చు. ‘దయచేసి ఈ ఫోన్‌ను ఫలానా చోట తిరిగి ఇచ్చేయండి.. ఈ నెంబర్‌కు ఫోన్ చేయండి.. అంటూ పోయిన ఫోన్ లాక్ స్ర్కీన్‌పై కనిపించేలా మెసేజ్, కొత్త ఫోన్ నెంబర్‌నూ పంపొచ్చు.
మీ ఫోన్లో డేటా(ఇంటర్నెట్) ఆన్‌లో ఉంటేనే ఫోన్ లొకేట్ అవుతుంది. లేకపోతే చివరిసారిగా ఆ ఫోన్ ఎప్పుడు ఆన్లైన్లో ఉందో కనిపిస్తుంది. గూగుల్ సెర్చ్ ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్లను మాత్రమే ఇలా వెతికేందుకు అవకాశం ఉంది. ఐఫోన్ యూజర్లు ఐక్లౌడ్‌పై ఆధారపడాల్సిందే. ఇవే కాక.. ప్రస్తుతం పోయిన ఫోన్ ని కనిపెట్టేందుకు చాలా రకాల యాప్స్ ఉన్నాయి. వాటి సహాయంతో కూడా కనిపెట్టవచ్చు.