ఇక ల్యాండ్ లైన్ ఫోన్ల కీ వాట్సాప్

First Published Mar 7, 2018, 3:10 PM IST
Highlights
  • ల్యాండ్ లైన్ నెంబర్స్ కి  కూడా వాట్సాప్ వినియోగించే అవకాశాన్ని తీసుకువచ్చారు.

ల్యాండ్ లైన్ ఫోన్ కి వాట్సాప్.. ఇదెలా సాధ్యం  అని ఆశ్చర్యపోతున్నారా..? సాధ్యమే కాకపోతే.. ఇందులో ఒక చిన్న తిరకాసు ఉంది. ఇప్పటి వరకు కేవలం మొబైల్ ఫోన్లలో మాత్రమే వాట్సాప్ వినియోగించుకునే వీలు ఉంది. డెస్క్ టాప్ లలో వాట్సాప్ వాడేందుకు వీలు కల్పించారు కానీ.. మొబైల్ ఫోన్ మాత్రం దగ్గరలోనే ఉండాలి. ఈ విషయం మనందరికీ తెలిసిందే. కాగా.. తాజాగా.. ల్యాండ్ లైన్ నెంబర్స్ కి  కూడా వాట్సాప్ వినియోగించే అవకాశాన్ని తీసుకువచ్చారు.

కాకపోతే.. దీనికి కూడా మొబైల్ ఫోన్ కావాల్సిందే. ఇందుకోసం వాట్సాప్‌ బిజినెస్‌ యాప్‌ డౌన్‌లోడ్‌‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని వ్యాపారం కోసం స్పెషల్ గా రిలీజ్ చేసినప్పటికీ ఎవరైనా మొబైల్‌ ఫోన్లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

బిజినెస్ వాట్సాప్ ని డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత ఫోన్ నెంబర్ కి బదులు ల్యాండ్ లైన్ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఇలా నెంబర్ ఇవ్వగానే ఓటీపీ  అడుగుతుంది. ల్యాండ్ లైన్ కి ఓటీపీ కష్టం కాబట్టి.. కాల్‌మీ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. వెంటనే ఫోన్ కి  కాల్ వస్తుంది. దీంతో.. మీ ల్యాండ్ లైన్ నెంబర్ తో వాట్సాప్ వచ్చేస్తుంది. ఇక ల్యాండ్ లైన్ ఫోన్ నెంబర్ తో వాట్సాప్ అన్ని సేవలను వినియోగించుకోవచ్చు.

 

click me!