సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని టాప్ ఆఫీసర్ ఆత్మహత్య

First Published May 11, 2018, 5:18 PM IST
Highlights

మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ మాజీ చీఫ్, ఐపిఎస్ అధికారి హిమాన్షు రాయ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

ముంబై: మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ మాజీ చీఫ్, ఐపిఎస్ అధికారి హిమాన్షు రాయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబైలోని తన నివాసంలో శుక్రవారంనాడు తన నివాసంలో సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని మరణించాడు.

హిమాన్షు రాయ్ గత కొంత కాలంగా బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన డిప్రెషన్ లో కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన అదనపు డీజీగా ఉన్నారు. అయితే ఏడాదిన్నరగా మెడికల్ లీవ్ పై ఉన్నారు. 

1988 ఐపిఎస్ బ్యాచ్ కు చెందిన హిమాన్షు రాయ్ 2013లో సంచలనం సృష్టించిన ఐపిఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు విచారణలో కీలక పాత్ర పోషించారు. ఈ కేసులో బాలీవుడ్ నటుడు దారా సింగ్ ను అరెస్టు చేశారు. 

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరు ఇక్బాల్ కస్కర్ డ్రైవర్ ఆరిఫ్ కాల్పుల కేసు, జర్నలిస్టు జేడే హత్య కేసు, విజయ్ పాలెండే,త లైలా ఖాన్ జంట హత్య కేసుల విచారణలో ప్రధాన పాత్ర పోషించారు. 

click me!