కెసిఆర్ మొక్కుబడుల కేసు విచారణకు స్వీకరించిన హై కోర్టు

First Published Mar 14, 2017, 7:41 AM IST
Highlights

కెసిఆర్ సొంత మొక్కులు ప్రజా సంక్షేమం కావు. మొక్కుబడుల ఖర్చును కెసిఆర్ వాపసు చేయాలి

గుళ్లకు గోపురాలకు ప్రజాధనంతో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సొంత మొక్కులతీర్చుకోవడం చెల్లదని ప్రముఖ  సామాజిక న్యాయవేత్త  ప్రొఫెసర్ కంచ ఐలయ్య వేసిన పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.

 

 

 ఈ పిటిషన్ మీద నాలుగు వారాలలో ప్రభత్వ వాదన కోర్టుకు  సమర్పించాలని ప్రధాన నాయ మూర్తితో కూడా కూడిన ధర్మాసనం తెలంగాణా అడ్వకేట్ జనరల్ ను ఆదేశించింది.

 

సర్కారు డబ్బుతో  సొంతమొక్కులు తీర్చుకోవడం చట్టవ్యతిరేకం, రాజ్యాంగ  వ్యతిరేకమని  పిటిషనర్ ఐలయ్యవాదించారు.  ఇలాంటి మొక్కుబడులు తీర్చుకునేందుకు దేవాదాయ శాఖ అధ్వర్యంలోని కామన్ గుడ్ ఫండ్ ను వాడటం ప్రజాధనం దుర్వినియోగం చేయడమేనని, దీనికోసం విడుదల చేసిన జివొ నెం 22, 23 లు చట్ట వ్యతిరేకంగా ప్రకటించాలని ఆయన కోర్టును కోరారు.

 

ఈ మధ్య ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తిరుపతి వేంకటేశ్వరునికి,విజయవాడ,  వరంగల్ అమ్మవారికి కానుకలు సమర్పించేందుకు సుమారు అరేడుకోట్లు ఖర్చు చేశారని, దీనిని ముఖ్యమంత్రి నుంచి వెనక్కు రాబట్టాలని  ఆయన వాదించారు. అంతేకాదు, ఈ కాన్కలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి ప్రయాణాలకయిన ఖర్చును కూడా రాబట్టాలని ఐలయ్య కోర్టును కోరారు.

 

కామన్ గుడ్ ఫండ్ వుండేది, రాబడి లేని ఆలయాలో ధూపదీప నైవేధ్యాల కోసం, పూజారుల వేతనం కోసం గాని, ముఖ్యమంత్రి సొంతమొక్కులు తీర్చుుకునేందుకు కాదన్నది ప్రొఫెసర్ ఐలయ్య వాదన.

 

టీ సర్కారుకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, దేవాదాయశాఖ కమీషనర్లకు హైకోర్టు ఈ మేరకు  నోటీసులు జారిచేిసింది.

 

 

click me!