పరిటాల రవి వచ్చాకే జిల్లాలో అరాచకం తగ్గింది

First Published Jan 11, 2018, 2:37 PM IST
Highlights

పరిటాల రవి వల్లే  అనంతపురం జిల్లాలో అరాచకం తగ్గింది

ఈ రోజు అనంతపురం జిల్లాలో హిందూపురం టిడిపి ఎమ్మెల్యే బాలయ్య చాలా సంచలనాత్మక కామెంట్స్ చేశారు.

ఆ రోజులలో నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు  పరిటాల రవీంద్రను  ఎందుకు తెలుగుదేశంలోకి తీసుకున్నది వివరించారు. అంతేకాదు, పరిటాల రవి తన మిషన్ పూర్తి చేయడంలో విజయవంతమయ్యారని కూడా చెప్పారు. ఆయనే మన్నారో చూడండి.

‘ఆనాడు పెనుగొండ  ప్రాంతంలో  అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయి. వారి అటకట్టి ంచేందుకే తెలుగుదేశం పార్టీ పరిటాల రవిని రంగంలోకి దింపింది.‘ అన్నారు.

ఒక విధంగా ఇది నిజం కూడా. ఆరోజులలో ఈ ప్రాంతాన్నంతా పరిపాలించింది ‘ఫ్యాక్షనిస్టులే’. అంత ఒక వర్గానికి చెందిన వారే. వారిని కాదని మరొకరు తలెత్తేపరిస్థితి లేదు. ఇలాంటపుడు పరిటాల రవి వచ్చారు. అంతా పరార్. ఈ రోజు పెనుగొండ ప్రాంతం నిమ్మళంగా ఉండేందుకు కారణం ఆయనే. అందుకే అక్కడ ఇపుడు నాలుగు పరిశ్రమలు పెట్టేందుకు ముఖ్యమంత్రి యోచిస్తున్నారు. అవి ఒక రూపు తీసుకుంటే, అనంతపురం జిల్లా స్వరూపమే మారిపోతుంది.  దీనిని ఎవరయినా స్వాగతించాల్సిందే.

గురువారం నాడు పెనుగొండలోని మడకశిర కూడలి వద్ద ఏర్పాటుచేసిన  నందమూరి తారకరామారావు విగ్రహాన్ని బాలకృష్ణ ఆవిష్కరించేందుకు ఆయన పెనుగొండ వచ్చారు.

ఈ సందర్బంగా ఆయన ప్రజల నుద్దేశించి మాట్లాడారు.

ఆనాడు అరాచక శక్తులకు అడ్డాగా ఉన్న పెనుగొండలో  ఈ రోజు  అభివృద్ధి ఫలాలు అందుతున్నాయంటే దానికి పరిటాల రవియే కారణమని అన్నారు.

‘పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎన్టీ రామారావు. అలాంటి మహానుభావుడి విగ్రహాన్ని  ఆవిష్కరించే అవకాశం దక్కడం నా పూర్వజన్మ సుకృతం. రాయలసీమలో ఎన్నో పరిశ్రమలు నెలకొల్పేందుకు  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశేషంగా కృషి చేస్తున్నారు. తొందర్లోనే అభివృద్ధి ఫలాలు అందరికి అందుతాయి,’ అని  బాలకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. 

click me!