వరకట్నంగా కొండముచ్చు.. కేసు నమోదు

First Published Feb 17, 2018, 5:40 PM IST
Highlights
  • హర్యాానాలో వింత సంఘటన
  • పెళ్లికొడుకుకి కట్నంగా కొండముచ్చు
  • కేసు నమోదు చేసిన అధికారులు

పెళ్లి కొడుక్కి  కట్నంగా నగదు, బంగారం, కారు, బైక్ లాంటివి సహజం. కానీ.. ఓ యువతి తల్లిదండ్రులు మాత్రం.. పెళ్లికొడుకుకి కొండముచ్చుని కట్నంగా ఇచ్చారు. దీంతో.. ఒక్కసారిగా వరుడు కుటుంబసభ్యులు షాక్ కి గురయ్యారు. ఈ సంఘటన హర్యానాలోని ఫతేబాద్ లో చోటుచేసుకుంది.

పూర్తివివరాల్లోకి వెళితే.. ఫతేహాబాద్ జిల్లాలోని తోహానా పట్టణానికి చెందిన సంజయ్ పూనియాకు జింద్ జిల్లాకు చెందిన రీతూ అనే యువతితో వివాహం నిశ్చయమైంది. వీరిద్దరికీ ఫిబ్రవరి 11న వివాహం జరిపించారు. కట్నంగా ఏమి కావాలని వధువు తరపు బంధువులు అడగగా.. ఏమీ వద్దు.. కావాలంటే కొండముచ్చు ఇవ్వండి అని సరదాగా అన్నారు వరుడు కుటుంబసభ్యులు.

దానిని నిజమనుకొని భావించిన వధువు తల్లిదండ్రులు.. నిజంగానే కొండముచ్చును కట్నంగా ఇచ్చారు.అయితే.. ఇక్కడే అసలు కథ అడ్డం తిరిగింది. ఎలాగూ ఇచ్చారు కదా అని వరుడు కుటుంబసభ్యులు కొండముచ్చుని ఇంటికి తీసుకువెళ్లారు. వన్య ప్రాణిని బంధించి హింసిస్తున్నారంటూ.. వారిపై వన్యప్రాణి సంరక్షణ అధికారులు సీరియస్ అయ్యారు. అంతేకాదు.. వారిపై కేసు కూడా నమోదు చేశారు.

click me!