కంచే చేను మేస్తోంది

First Published Dec 18, 2016, 3:59 AM IST
Highlights

కొందరు బడాబాబులకు ఆర్బిఐ, బ్యాంకు అధికారులే దగ్గరుండి మరీ కొత్త కరెన్సీ కట్టలను చేరుస్తున్న విషయం బయటకు వస్తోంది.

‘కంచే చేనుమేసిందని’, ‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా’ ...ఇలా ఎన్ని సామెతలు చెప్పుకున్నా తక్కువే. ఈ సామేతలన్నీ ఎందుకనుకుంటున్నారా. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో వెలుగు చూస్తున్నఅక్రమాల్లో ఆర్బిఐ, బ్యాంకులే ప్రధాన పాత్రగా బయటపడుతున్నాయి కాబట్టి.

 

పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా ఒక్కసారిగా కరెన్పీ సంక్షోభం మొదలైంది. అదీ ఇది అని తేడాలేకుండా అన్నీ రంగాలూ కుదేలయ్యాయి. ఇటువంటి పరిస్ధితుల్లో ఉన్న కొద్దిపాటి కొత్త కరెన్సీని దేశంలోని ప్రజలందరికీ అందచేయాల్సిన బాధ్యత అటు ఆర్బఐ, ఇటు బ్యాంకులదే. ఇక్కడే అటు ఆర్బిఐ ఇటు బ్యాంకులు కక్కుర్తి పడ్డాయి.

 

బ్యాంకులు చేసిన పనివల్ల సామాన్యుడేమో 2 వేల నోటు కోసం రోజుల తరబడి క్యూలైన్లలో నిల్చోవాల్సి వస్తూంటే, కొందరు బడాబాబులకేమో వారి ఇళ్ల వద్దకే కోట్ల కొద్దీ కొత్త కరెన్సీ నడుకుని వెళుతోంది. దాంతో దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర అసహనం పెరిగిపోయి గొడవలవుతున్నాయి.

 

పరిస్ధితిని గమనించిన కేంద్రం వెంటనే దర్యాప్తు సంస్ధలను రంగంలోకి దింపింది. దాంతో జరిగిన అక్రమాలు వెలుగు చూస్తున్నాయ.

 

కొందరు బడాబాబులపై ఐటి, సిబిఐ, ఐబి తదితర సంస్ధలు జరిపిన దాడుల్లో వందల కోట్ల కొత్త కరెన్సీ బయటపడుతోంది. వేలాది కోట్ల అక్రమ ఆస్తులు కూడా బయటకు వస్తున్నాయి. కొందరు బడాబాబులకు ఆర్బిఐ, బ్యాంకు అధికారులే దగ్గరుండి మరీ కొత్త కరెన్సీ కట్టలను చేరుస్తున్న విషయం బయటకు వస్తోంది. ఇంకోవైపు ప్రజలు కూడా తమకు తెలిసిన సమాచారాన్ని ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు.

 

వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులను పరిశీలించి ఇప్పటికే సిబిఐ, ఐటి అధికారులు దర్యాప్తలో భాగంగా పలువురిని అరెస్టు చేసారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ కొన్ని వందల బ్యాంకులకు ఆర్బిఐ నోటీసులిచ్చింది. బ్యాంకుల సిబ్బందిపై దాదాపు 30 లక్షలకుపైగా ఫిర్యాదు అందాయి.

 

ప్రతీ బ్యాంకు శాఖలోనూ ఉదయం నుండి రాత్రి వరకూ జరిగిన లావాదేవీల సిసి ఫుటేజిలను ఆర్బిఐ స్వాధీనం చేసుకుంటోంది. నోట్ల చెల్లింపు, నగదు మార్పిడిపైనే ఆర్బిఐ ప్రధానంగా దర్యాప్తు జరుపుతోంది.

 

 

 

 

click me!