
కాపు రిజర్వేషన్ పోరాట నాయకుడు ముద్రగడ పద్మనాభానికి మళ్లీ కోపం వచ్చింది. ముద్రగడ ఏదో ఒక విగ్రహావిష్కరణచేయిస్తున్నారని దాని అడ్డుకోవాలని రెవిన్యూ అధికారులు మౌఖిక ఉత్తర్వులు జారీ చేయడం మీద ఆయన మండిపడుతున్నారు. ఈ మేరకు ఆయన తూర్పు గోదావరి జిల్ల ా కలెక్టర్ కు ఒక లేఖ రాశారు. తన కుటుంబంలో సమాజానికి పాటుపడిన వారున్నప్పటికి వారి విగ్రహాలను ప్రతిష్టించేందుకు తానెపుడూ ప్రయత్నించ లేదని, ప్రయత్నించనని ఆయన చెప్పారు. ప్రభుత్వజాగాలో విగ్రహం పెడుతున్నట్లు అధికారులు ప్రచారం చేయడానికి ఆయన అభ్యంతరం చెప్పారు. చివరకు తన శవం ప్రభుత్వ నీడ పడనీయడం తనకు ఇష్టం లేదని ఆయన ఖరాకండిగా చెప్పారు. ఇదిగో ఆయన కలెక్టర్ కు రాసిన ఉత్తరం: