నకిలీ జర్నలిజానికి చెక్ పెట్టనున్న గూగుల్.. 8000 జర్నలిస్టులకి శిక్షణ!

First Published Jun 23, 2018, 10:53 AM IST
Highlights

నకిలీ జర్నలిజానికి చెక్ పెట్టనున్న గూగుల్.. 8000 జర్నలిస్టులకి శిక్షణ!

నకిలీ వార్తలు ప్రసారం చేసే మాధ్యమాలు నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో, వాటి ఆగడాలకు చెక్ పెట్టేందుకు అంతర్జాల దిగ్గజం గూగుల్ ఓ కొత్త మార్గానికి శ్రీకారం చుట్టింది. ఇలాంటి నకిలీ వార్తల విషయంలో నిజానిజాలను అన్వేషించేందుకు గాను సుమారు 8000 మంది జర్నలిస్టులకు శిక్షణ ఇవ్వాలని గూగుల్ ఇండియా నిర్ణయించింది.

ఆంగ్లం, తెలుగు, తమిళం, హిందీ, బెంగాళీ, మరాఠీ మరియు కన్నడ భాషలలో ఈ ట్రైనింగ్ వర్క్‌షాపులను నిర్వహిస్తామని గూగుల్ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది. జర్నలిస్టులను నకలీ వార్తల ఉచ్చులో పడకుండా కాపాడేందుకే ఈ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించామని గూగుల్ తెలిపింది.

గూగుల్ ఇందుకోసం మన ఠాగూర్ చిత్రం కాన్సెప్ట్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మొదటి ముగ్గురికి సాయం చేస్తే వారు మరో ముగ్గురికి, ఆ తర్వాత వారు మరో ముగ్గురికి సాయం చేసినట్లుగా.. గూగుల్ వివిధ నగరాలన నుంచి జర్నలిస్టుల నైపుణ్యాల ఆధారంగా 200 మందిని ఎంపిక చేసి వారికి తొలుత శిక్షణ అందజేయనుంది.

ఇలా శిక్షణ పొందిన జర్నలిస్టులు తిరిగి మరికొందరు జర్నలిస్టులను, ఆ మరికొందరు ఇంకొందరు జర్నలిస్టులకు శిక్షణ ఇస్తారు. ఫస్ట్ డ్రాఫ్ట్, స్టోరీఫుల్, ఆల్ట్‌న్యూస్, బూమ్‌లైవ్, ఫ్యాక్ట్‌చెకర్.ఇన్, డాటాలీడ్స్ నుంచి నిపుణుల తయారు చేసే కరిక్యులం ఆధారంగా చేసుకొని జర్నలిస్టుల కోసం నిజానిజాల అన్వేషణ, ఆన్‌లైన్ వెరిఫికేషన్, డిజిటల్ హైజీన్ వంటి అంశాల్లో శిక్షణ ఇస్తారు. ఇలా చేయటం నకిలీ వార్తలను పూర్తిగా నివారించాలనేది గూగుల్ అభిప్రాయం.

click me!