పది పాసైతే.. నేవీలో ఉద్యోగం

First Published Feb 12, 2018, 11:09 AM IST
Highlights
  • నిరుద్యోగులకు శుభవార్త

నిరుద్యోగులకు శుభవార్త. కేవలం పదో తరగతి పాస్ అయ్యి ఉంటేచేలు.. ఇండియన్ నేవీలో ఉద్యోగాన్ని సంపాదించుకోవచ్చు. వివరాల్లోకి వెళితే.. ఇండియన్ కోస్ట్ గార్డ్ నావిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కనీస విద్యార్హత పదోతరగతిగా ప్రకటించింది. టెన్త్ క్లాస్ లో కనీసం 50శాతం మార్కులతో పాస్ అయ్యి ఉండాలి. అదే ఎస్టీ, ఎస్సీ విద్యార్థులైతే 45శాతం ఉత్తీర్ణత ఉంటే చాలు.  అక్టోబర్ 1, 2018 నాటికి 18 నుంచి 22 ఏళ్లలోపు వయసు ఉన్నవారు ఎవరైనా ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ లకు అయితే.. మరో ఐదు సంవత్సరాలు, బీసీలకు మూడు సంవత్సరాలు వయో పరిమితి ఉంది.

ప్రారంభ జీతం రూ.21,700గా ఉంటుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు ఉంటాయి. వీటన్నింటితో నెలకు రూ. 35,000 వరకు వేతనం రూపంలో లభిస్తుంది. క్యాంటీన్‌, ఎల్‌టీసీ, వైద్య సేవలు..మొదలైన సౌకర్యాలు కల్పిస్తారు. భవిష్యత్తులో వీరు ప్రధాన అధికారి హోదా వరకు చేరుకోవచ్చు.  ముందు రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్ , మెడికల్ టెస్ట్ లు ఉంటాయి.  ఈ మూడింటిలో ఎంపికైతే ఉద్యోగం గ్యారెంటీ. ఉద్యోగం కావాలనునే వారు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 16 సాయంత్రం 5గంటలతో ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీగా ప్రకటించారు. రాత పరీక్ష ఏప్రిల్ నెలలో నిర్వహించే అవకాశం ఉంది.

click me!