మళ్లీ పెరిగిన బంగారం ధర

First Published Jan 4, 2018, 11:01 AM IST
Highlights
  • నేటి మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి

బంగారం ధర రోజు రోజుకీ పెరిగిపోతోంది.  కేవలం 18 రోజుల వ్యవధిలో పది గ్రాముల బంగారం ధర రూ.1050పెరిగింది. జనవరి 1న రూ.28,100గా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నేడు (జనవరి 4న) రూ.28,190కి చేరింది. అంటే రెండు రోజుల్లో రూ.90 పెరిగింది. మరోవైపు వెండి ధర నిలకడగా కొనసాగుతోంది. జనవరి 1తో పోలిస్తే బుధవారం కిలో వెండిపై రూ.200 తగ్గింది.

నేటి మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్స్ పది గ్రాముల బంగారం ధర రూ.28,190 కాగా.. 24క్యారెట్స్ బంగారం ధర రూ.30,752గా ఉంది. విజయవాడ నగరంలో 22 క్యారెట్స్ పది గ్రాముల బంగారం ధర రూ.28,190కాగా.. 24క్యారెట్ల తులం బంగారం ధర రూ.30,752గా ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.28,190కాగా, 24క్యారెట్ల బంగారం ధర రూ.30,752గా ఉంది. ఇక మూడు నగరాల్లో కేజీ వెండి ధర రూ.41,800గా ఉంది.

click me!