స్వల్పంగా తగ్గిన బంగారం ధర

First Published Apr 6, 2018, 5:10 PM IST
Highlights
పసిడి ధర తగ్గింది.. వెండి ధర పెరిగింది

బంగారం ధర స్వల్పంగా తగ్గింది. గురువారం నాటి మార్కెట్లో స్వల్పంగా తగ్గిన బంగారం.. నేటి మార్కెట్లో మరికాస్త తగ్గింది. రూ.200లు తగ్గడంతో పది గ్రాముల పసిడి ధర రూ.31,350కి చేరింది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల దగ్గర నుంచి కొనుగోళ్లు మందగించడంతో బంగారం ధర పడిపోయినట్లు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. ఇక వెండి ధర స్వల్పంగా పెరిగింది. రూ.75 పెరగడంతో కిలో వెండి రూ.39,050కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణెల తయారీదారుల నుంచి స్వల్ప డిమాండ్‌ రావడంతో వెండి ధర పెరిగినట్లు ట్రేడర్లు చెబుతున్నారు. అంతర్జాతీయంగా బంగారం ధర 0.30శాతం తగ్గడంతో ఔన్సు 1,322.20 డాలర్లు పలికింది.

click me!