వరసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర

First Published Feb 21, 2018, 4:51 PM IST
Highlights
  • పదిగ్రాముల బంగారం రూ.31,450
  • కేజీ వెండి ధర రూ.39,300

పసిడి ధర వరసగా రెండో రోజు తగ్గింది. మంగళవారం నాటి మార్కెట్లో రూ.100 తగ్గిన బంగారం ధర.. బుధవారం మరింత తగ్గింది. రూ.250 తగ్గి పది గ్రాముల బంగారం ధర రూ.31,450కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు తగ్గడంతో పసిడి ధర తగ్గినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

వెండి కూడా పసిడి బాటలోనే నడిచింది. నేటి మార్కెట్లో రూ.140 తగ్గి కేజీ వెండి ధర రూ.39,300గా ఉంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీ దారుల నుంచి డిమాండ్ తగ్గడంతో వెండి ధర తగ్గినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక అంతర్జాతీయంగాను బంగారం ధర 0.21శాతం తగ్గి ఔన్సు 1,326 డాలర్లు పలికింది. వెండి 0.18శాతం తగ్గడంతో ఔన్సు 16.39డాలర్లు పలికింది.

click me!