పిల్లల కోసం ఫేస్‌బుక్‌ మెసేంజర్

First Published Dec 5, 2017, 4:18 PM IST
Highlights
  • పిల్లల కోసం ఇలా ఫేస్ బుక్ యాప్ రూపొందించడం ఇదే తొలిసారి కావడం విశేషం

ప్రముఖ సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్‌బుక్‌ పిల్లల కోసం ప్రత్యేకంగా ఓ యాప్ ని ప్రవేశపెట్టింది. ఫేస్ బుక్ ఉపయోగించే ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఫేస్ బుక్ మెసేంజర్ యాప్ ని వినియోగిస్తూనే ఉంటారు.  అయితే.. ఇలాంటి యాపే ప్రత్యేకంగా పిల్లల కోసం రూపొందించింది. పిల్లల కోసం ఇలా ఫేస్ బుక్ యాప్ రూపొందించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

13 సంవత్సరాలలోపు పిల్లలు ఈ యాప్ ని వినియోగించుకోవచ్చు. దీని ద్వారా ఫోటోలు,వీడియోలు షేర్ చేసుకునే అవకాశం ఉంది. ఈయాప్ ని సోమవారం యూఎస్ లో అధికారికంగా లాంచ్ చేశారు. త్వరలోనే ఇతర దేశాల్లో కూడా అందుబాటులోకి తీసుకురానుంది. అంతేకాకుండా ప్రస్తుతానికి ఈ యాప్ ఐఫోన్లలో మాత్రమే పనిచేస్తోంది. త్వరలోనే ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా అందుబాటులోకి రానుంది. అయితే.. ఇందులో ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. పిల్లలకు వచ్చే రిక్వెస్ట్ లు యాక్సెప్ట్ చేయాలన్నా.. అసలు ఈ యాప్ వినియోగించాలన్నా.. పేరెంట్స్ పర్మిషన్ తప్పనిసరి. అంటే ఇద్దరు పిల్లలు మెసేంజర్ లో స్నేహితులు కావాలనుకున్నారనుకోండి.. ఆ ఇద్దరు పిల్లల తల్లిదండ్రులు మొదట దానిని ఒకే చేయాల్సి ఉంటుంది.



 

 

 

 

 

 

click me!