ఫేస్ బుక్ మెసేంజర్ లో అద్భుతమైన ఫీచర్

First Published Feb 22, 2018, 3:50 PM IST
Highlights
  • ప్రస్తుత కాలంలో ఫేస్ బుక్ గురించి తెలియని వాళ్లు ఎవరూ ఉండరు అనడంలో ఆశ్చర్యం లేదు. ఫేస్ బుక్ ని ఎంతగా వినియోగిస్తున్నారో.. మెసెంజర్ ని కూడా అంతే వినియోగిస్తుంటారు.

ఫేస్ బుక్ మెసేంజర్ వినియోగదారులకు శుభవార్త. ఫేస్ బుక్ వినియోగదారులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఫీచర్ ని సంస్థ తాజాగా ప్రవేశపెట్టింది. ప్రస్తుత కాలంలో ఫేస్ బుక్ గురించి తెలియని వాళ్లు ఎవరూ ఉండరు అనడంలో ఆశ్చర్యం లేదు. ఫేస్ బుక్ ని ఎంతగా వినియోగిస్తున్నారో.. మెసెంజర్ ని కూడా అంతే వినియోగిస్తుంటారు. దీనిలో ఇప్పటివరకు మెసేజ్ లు, వీడియో కాల్స్ చేసుకునే సదుపాయం మాత్రమే ఉండేది. ఇక నుంచి గ్రూప్ వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు.

గతంలో కూడా మెసేంజర్ లో గ్రూప్ వీడియో కాల్ సదుపాయం ఉండేది. కాకపోతే.. ముందే గ్రూప్ క్రియేట్ చేసుకొని ఉంటే.. అందులో ఉన్నవారితో  మాత్రమే మాట్లాడే అవకాశం ఉండేది. అయితే.. ఇప్పుడు అలా కాదు. మీరు ఒక వ్యక్తితో వీడియో కాల్ లో మాట్లాడుతూ.. ‘‘ఆడ్ పర్సన్’’ అనే బటన్ ని ప్రెస్ చేస్తే.. ఎరిని కావాలంటే వారిని..ఆ గ్రూప్ కాల్ లోకి యాడ్ చేసుకోవచ్చు. ఎంతమందితో వీడియో కాల్ మాట్లాడాలనుకుంటున్నారో.. అంతమందిని యాడ్ చేసుకొని అందరూ ఒకేసారి మాట్లాడొచ్చు.

click me!