ఆరు నెలల్లో తెలంగాణాలో ప్రతి ఇంటికి ఇంటర్నెట్

Published : Sep 09, 2017, 02:52 PM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
ఆరు నెలల్లో తెలంగాణాలో ప్రతి ఇంటికి ఇంటర్నెట్

సారాంశం

ప్రతిఇంటికీ నల్లా కనెక్షన్ తో పాటు ఇంటర్నెట్, తెలంగాణా వినూత్న పథకం

వచ్చే ఆరు నెలల్లో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే కాకుండా ఇంటింటికీ ఇంటర్నెట్ సేవలను అందిస్తున్నామని ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు  స్పష్టం చేశారు. 49వ స్కోచ్ సమ్మిట్ సందర్భంగా స్కోచ్ సంస్థ ఆయనను ఐటీ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో కేటీఆర్‌ను సన్మానించింది.  ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.  ఐటీ మంత్రిగా రాష్టంలో చేపట్టిన పలు కార్యక్రమాలను వివరించారు.   దేశంలోనే మొదటి రాష్ట్రంగా బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను ఇంటింటికీ అందిస్తున్నామని చెప్పడానికి గర్వకారణంగా ఉందన్నారు. ప్రత్యేకంగా బ్రాడ్ బ్యాండ్ కోసం చర్యలు తీసుకోకుండా  ప్రణాళికతో ఉన్న వసతులనే  ఉపయోగించుకుని ముందుకు వెళ్తామని ఆయన తెలిపారు. ఇటువంటి ఆలోచనలే.. ఇంకా దేశవ్యాప్తంగా రావాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !