ఇది పాఠశాలా..? మురికి కాలువా...?

First Published Jan 22, 2018, 3:09 PM IST
Highlights
  • మురికి కాలువ ఆనుకొని ప్రభుత్వ పాఠశాల
  • ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తుచూపుతున్న నెటిజన్లు

ఈ ఫోటోలో కనిపిస్తున్నది ఓ ప్రభుత్వ పాఠశాల. దాని పక్కన ఉన్నది.. నీటి కొలను అనుకొని భ్రమపడేరు. అదొక మురికి కుంట. అటుగా వెళ్తేనే భరించలేనంత కంపు కొడుతుటుంది. దోమలు, ఈగలు, పురుగులకు అది ఒక సుస్థిర స్థానం. దురుదృష్టం ఏమిటంటే.. దాని పక్కనే పాఠశాల విద్యార్థులు భోజనాలు చేయాలి. అక్కడే ఉపాధ్యాయులు పాఠాలు బోధించాలి.  

మాములుగా అయితే.. మురికి కుంట పక్కన నిమిషం పాటు ఉండటే ఊపిరాడనంత పని అవుతుంది. అలాంటిది ఆ స్కూల్ పిల్లు మాత్రం ఉదయం పాఠశాలకు వెళితే.. మళ్లీ సాయంత్రం ఇంటికి వచ్చే వరకు అక్కడే కాలం గడపాల్సి వస్తోంది. ఈ దయనీయమైన పరిస్థితి మరెక్కడో కాదు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం భీముని పాలెం అనే గ్రామంలో. ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే స్థోమత లేక చాలా మంది పిల్లలు ఆ కంపు భరిస్తూనే స్కూల్ కి వస్తున్నారు. స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా.. పెద్దగా పట్టించుకోకపోవడం గమనార్హం.

ఇప్పుడు ఈ స్కూల్ ఫోటోలే నెట్టింట సంచలనం సృష్టిస్తాయి. ఓ సామాజిక కార్యకర్త.. పాఠశాల ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పెట్టి.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. పాఠశాలలు ఈ విధంగా ఉంటే... ఎవరు మాత్రం సర్కారీ బడుల్లో చదువుకుంటారు.. అని ప్రశ్నిస్తున్నారు.

click me!