సెల్ఫీలు ఎక్కువగా  దిగుతున్నారా..? ట్రీట్ మెంట్ అవసరమే

First Published Dec 19, 2017, 1:40 PM IST
Highlights
  • రోజుకి ఒక్క సెల్ఫీ అయినా.. దిగకుండా ఉండలేని వాళ్లు కూడా ఉన్నారు. మీరు కూడా అదే కోవలోకి వస్తారా?

సెల్ఫీ.. ప్రస్తుత కాలంలో దీని గురించి తెలియని వాళ్లు ఉండరనడంలో సందేహం లేదు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వారికు.. రకరకాల సందర్భాల్లో సెల్ఫీలు దిగుతున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఈ సెల్ఫీ మోజులో మునిగి తేలుతున్నారు.  రోజుకి ఒక్క సెల్ఫీ అయినా.. దిగకుండా ఉండలేని వాళ్లు కూడా ఉన్నారు. మీరు కూడా అదే కోవలోకి వస్తారా? సమయం, సందర్భం లేకుండా సెల్ఫీలు దిగుతున్నారా? అయితే కచ్చితంగా మీకు ట్రీట్ మెంట్ అవసరం. మీరు ఒకరకమైన జబ్బుతో బాధపడుతున్నారని అర్థం. మీరు చదివుతున్నది నిజమే. దీనిపై పలువురు నిపుణులు పరిశోధనలు కూడా జరిపారు.

మనదేశంలో సెల్ఫీ వెర్రీ.. బాగా పెరిగిపోయింది. స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగిన దగ్గర నుంచి ఈ సెల్ఫీ పిచ్చి మరింత పెరిగింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటంతో విచ్చలవిడిగా సెల్ఫీలు దిగేస్తున్నారు. చాలా మంది ఈ సెల్ఫీ మోజులో వింత పోకడలకు పోయి ప్రాణాలు కూడా కోల్పోయారు. కాగా.. ఈ సెల్ఫీ మోజుపై నటిగామ్ ట్రెన్ట్ యూనివర్శిటీ నిపుణులు పరిశోధనలు జరిపారు. దాదాపు 400మంది వీరు సర్వే తెలిపారు.

ఎక్కువగా సెల్ఫీలు దిగేవారిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువగా ఉంటుందని, ఫిట్ గా ఉండలేరని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా రోజురోజుకీ ఈ సెల్ఫీలకు యువత ఎడిక్ట్ అయిపోతున్నట్లు వారి సర్వేలో తేలింది. అలా ఎడిక్ట్ అయిపోతే.. వారు కచ్చితంగా ఒకానొక సందర్భంలో ట్రీట్ మెంట్ తీసుకోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి.. సెల్ఫీలు దిగండి.. కానీ మరీ అతిగా దిగకండి అని సూచిస్తున్నారు.

click me!