కాచిగూడ ‘బ్రెడ్ ఆమ్లేట్’ రుచి చూశారా?

First Published Dec 29, 2017, 5:21 PM IST
Highlights
  • రుచికరమైన బ్రెడ్ ఆమ్లేట్ తినాలంటే కాచిగూడ వెళ్లాల్సిందే.

‘ బ్రెడ్ ఆమ్లేట్’ పేరు వింటేనే నోరు ఊరిపోతోంది కదా. ప్రస్తుతం హైదరాబాద్ లో ఏ గల్లీలో చూసినా.. మీకు బ్రెడ్ ఆమ్లేట్ దొరుకుతుంది. కానీ.. ఒక్కసారి తింటే.. మళ్లీ మళ్లీ తినాలనిపించే బ్రెడ్ ఆమ్లేట్ రుచి చూశారా.. 34 సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో ఓ వ్యక్తి రుచి కరమైన బ్రెడ్ ఆమ్లేట్ ని అందిస్తున్నాడు. పక్క జిల్లాల నుంచి వచ్చిమరీ చాలా మంది ఈ బ్రెడ్ ఆమ్లేట్ రుచి చూస్తున్నారు. అది ఉంది ఎక్కడో కాదు కాచీగూడ చౌరస్తాలోనే. దీని కథంటే చూద్దామా..

కాచిగూడ బసంత్‌ కాలనీలో నివాసం ఉండే అక్బర్‌ బ్రెడ్‌ ఆమ్లెట్‌ తయారీకి నాణ్యమైన నూనె, సొంతంగా తయారు చేసిన అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను వినియోగిస్తారు. బ్రెడ్‌ ఆమ్లెట్‌ కోసం తాజా శాండ్‌విచ్‌ బ్రెడ్‌ను వాడతారు. ప్రస్తుతం అక్కడ బ్రెడ్‌ ఆమ్లెట్‌తో పాటు ప్లెయిన్‌ ఆమ్లెట్‌, ఆఫ్‌ఫ్రై ఆమ్లెట్‌ కూడా దొరుకుతుంది. తాజాగా తరిగిన ఉల్లి, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి’ వీటివల్లే ఆ రుచిని మర్చిపోలేం అంటున్నారు బ్రెడ్‌ ఆమ్లెట్‌ ప్రేమికులు. ఉదయం 12 గంటల నుంచి మొదలు అర్ధరాత్రి వరకు 500 మంది వరకు బ్రెడ్‌ ఆమ్లెట్‌ రుచి చూస్తారని అక్బర్‌ గర్వంగా చెబుతున్నారు. 34 ఏళ్ల క్రితం అంటే 1983లో బ్రెడ్‌ఆమ్లెట్‌ దుకాణం ప్రారంభించినపుడు రూపాయికి అమ్మితే ప్రస్తుతం రూ. 50 కి అమ్ముతున్నారు. వర్షాకాలం, చలికాలం అయితే ఏకంగా క్యూలు కట్టేస్తుంటారు. ఎంత రద్దీ ఉన్నా.. ఆర్డర్ చేసిన ఐదు నిమిషాల్లో వేడి వేడి బ్రెడ్ ఆమ్లేట్ మీ ముందు ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు.   

 

click me!