రూ.10కే భోజనం

First Published Dec 26, 2017, 11:31 AM IST
Highlights
  • ఈ కేందాల్రో నాలుగు పూరీలు, 150 గ్రాముల కూర, పప్పుతో 250 గ్రాముల రైస్‌ అందిస్తారు.

కేవలం రూ.10కే కడుపు నిండా భోజనం చేయవచ్చు. ఇంతకీ ఎక్కడ అనుకుంటున్నారా..? దేశ రాజధాని ఢిల్లీలో. మాజీ ప్రదాని అటల్‌ బిహారి వాజ్‌పేయి జన్మదినం సందర్భంగా సోమవారం సబ్సిడీ లంచ్‌ పథకానికి శ్రీకారం చుట్టాయి.విషయం ఏమిటంటే.. ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీ నేతలు విభిన్న పథకాలను అమలు చేస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే దేశరాజధాని ఢిల్లీలో ఈ రూ.10కే లంచ్ పథకాన్ని చేపట్టాయి. ఇప్పటికే తమిళనాడులో ‘ అమ్మ క్యాంటీన్లు’, ఆంధ్రప్రదేశ్ లో ‘ అన్న క్యాంటీన్లు’, బెంగళూరులో ‘ ఇందిర క్యాంటీన్లు’ పేరిట పేద ప్రజలను తక్కువ ధరకే భోజనం అందిస్తున్నాయి. అదే కోవలో ఇప్పుడు  ఢిల్లీలోనూ‘ అటల్ జన్ ఆహార్ యోజన’ పేరిట  మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ స్కీమ్ ని ఏర్పాటు చేశారు.

 ఢిల్లీలోని ఓఖ్లా మండి,  గ్రీన్‌పార్క్‌, రఘువీర్‌ నగర్‌, కక్రౌలా మోర్‌, నజఫ్‌గర్‌, షాలిమార్‌ బాగ్‌లో ఆరు కేంద్రాలను ప్రారంభించారు. వచ్చే ఏడాది ప్రతి వార్డులోనూ ఒక సబ్సిడీ లంచ్‌ కేంద్రాన్ని ప్రారంభిస్తామని ఉత్తర, దక్షిణ ఢిల్లీ కార్పొరేషన్లు ప్రకటించాయి. మధ్యాహ్న భోజన కిచెన్‌లు నిర్వహిస్తున్న ఎన్‌జీవోలు ఈ బాధ్యతను చేపట్టాయి. మధ్యాహ్నం రెండు గంటల వరకు తెరిచివుంచే ఈ కేందాల్రో నాలుగు పూరీలు, 150 గ్రాముల కూర, పప్పుతో 250 గ్రాముల రైస్‌ అందిస్తారు.  

రోజూ 500 నుంచి 700 ప్లేట్లు అందుబాటులో ఉంచుతామని గ్రీన్‌పార్క్‌ వద్ద ఏర్పాటైన అటల్‌ కేంద్రంను నిర్వహిస్తున్న ఓ సెల్ఫ్‌ హెల్ప్‌ సంస్థ ప్రతినిధి గాడ్‌ఫ్రే పెరిరా చెప్పారు. మరోవైపు అటల్‌ ఆహార్‌ కేం‍ద్ర ప్రారంభం కావడంతో ఎన్నికల హామీల్లో ముఖ్యమైన వాగ్ధానం నెరవేరడం పట్ల సంతోషంగా ఉందని సౌత్‌ ఢిల్లీ మేయర్‌ కమల్జీత్‌ షెరావత్‌ సంతృప్తి వ్యక్తం చేశారు.

click me!