రాజేష్ కు పటుత్వ పరీక్ష చేయాల్సిందే - చిత్తూరు కోర్టు

First Published Dec 12, 2017, 7:57 PM IST
Highlights
  • శోభనం రాత్రి భార్యను గాయపర్చిన  రాజేష్ కేసులో కీలక ఆదేశం
  • పటుత్వ పరీక్ష నిర్వహించాలని ఆదేశించిన చిత్తూరు కోర్టు 

శోభనం రాత్రే భార్యపై బ్లెడ్ తో దాడి చేసి అతి కిరాతకంగా ప్రవర్తించిన రాజేష్ కు పటుత్వ పరీక్షలు నిర్వహించాలని చిత్తూరు కోర్టు ఆదేశించింది. అతడ్ని నపుంసకుడిగా పేర్కొన్నందుకే భార్యను అంత తీవ్రంగా గాయపర్చాడని  ఆరోపనలున్నాయి. ఈ ఆరోపనల నేపథ్యంలో అతడికి అసలు మగతనం ఉందా, లేదా అన్నదానిపై రాజేష్‌కు హైదరాబాద్‌లోని ఫోర్సెనిక్ ల్యాబ్‌లో పటుత్వ పరీక్షలు నిర్వహించాలని చిత్తూరు కోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ పటుత్వ పరీక్షల నివేదికను తర్వాతి విచారణకు తమకు సమర్పించాలని పోలీసులను సూచించింది. ఈ కేసు విచారణను ఈనెల 15కు కోర్టు వాయిదా వేసింది.

ఈ ఘటనకు సంభందించిర వివరాల్లోకి వెళితే  చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం ఆధీనపల్లికి చెందిన రాజేష్ కు, చిన్నదామర గుంటకు చెందిన శైలజకు వివాహమైంది. పెళ్లి తర్వాత అమ్మాయివాళ్లింట్లో ఏర్పాటు చేసిన శోభనం రాత్రి శైలజ పై రాజేష్ దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన విషయం తెలిసిందే. కూతురిని తీవ్రంగా గాయపర్చిన అల్లుడు రాజేష్ ను పోలీసులకు అప్పగించారు తల్లిదండ్రులు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మొదట 336, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అతడికి మగతనం లేదని బైట చెప్పానని అనుమానించి తనను చితకబాదాడన్న శైలజ మాటల నేపథ్యంలో మోసం చేసి పెళ్లి చేశారంటూ అతని తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు.
 

అయితే రాజేష్ దాంపత్య జీవితానికి పనికొస్తాడో, రాడో తెలుసుకోవాలంటే పటుత్వ పరీక్షలు నిర్వహించాలని పోలీసులు న్యాయమూర్తిని కోరారు. దీంతో న్యాయమూర్తి రాజేష్‌కు హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పటుత్వ పరీక్షలు నిర్వహించాలని చిత్తూరు కోర్టు ఆదేశించింది.

click me!