బీజేపీపై రమ్య సంచలన వ్యాఖ్యలు

First Published May 17, 2018, 10:59 AM IST
Highlights

గుర్రాల వ్యాపారం చేస్తున్నారన్న రమ్య

బీజేపీ నేతలపై కాంగ్రెస్ నేత, సినీ నటి రమ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కర్ణాటకలో అనేక అనూహ్య పరిణామాల అనంతరం బీజేపీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. నెల రోజుల్లో బీజేపీ తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

ఈనేపథ్యంలో.. ఈ వియంపై కాంగ్రెస్ నేత రమ్య ట్వీట్ల వర్షం కురింపించారు. కర్ణాటక రాష్ట్ర రాజకీయాలలో గుర్రాల వ్యాపారం ప్రారంభమైంది అని నటి, కాంగ్రెస్‌ నాయకురాలు రమ్య ఆరోపిస్తూ ట్వీట్‌ చేశారు. కేంద్ర మంత్రి  పీయూశ్‌ గోయల్‌ గత గుజరాత్‌ ఎన్నికలలో కూడా అనేకమంది ఎమ్మెల్యేలను వ్యాపారుల చేత కొనుగోలుకు యత్నించారన్నారు. ఇప్పుడు కర్ణాటకలో కూడా అదే మాదిరిలో కాంగ్రెస్‌–జేడీఎస్‌ ఎమ్మెల్యేలను గుర్రాల వ్యాపారంలో మాదిరి కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు.

ఇదే విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ..ఆపరేషన్‌ కమలానికి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు లొంగరన్నారు. బీజేపీ ఇప్పటికే కాంగ్రెస్‌, జేడీఎస్‌కు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలను సంప్రదించి ప్రలోభాలకు తెరలేపిందన్నారు. అయితే తమ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లోనుకాలేదన్నారు. దేవగౌడ, కుమారస్వామిలకు వారి ఎమ్మెల్యేలపై విశ్వాసం ఉందని, వారు ఆపరేషన్‌ కమలానికి అవకాశం కల్పించరనే విశ్వాసం ఉందని పేర్కొన్నారు.

click me!