జగన్ పాదయాత్రపై గందరగోళం

Published : Nov 03, 2017, 12:20 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
జగన్ పాదయాత్రపై గందరగోళం

సారాంశం

 పాదయాత్రకు అనుమతి కోరని వైసీపీ  మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న పాదయాత్ర పాదయాత్రపై గందరగోళం

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేయనున్న ‘ప్రజా సంకల్ప’ పాదయాత్రపై గందరగోళం నెలకొందా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. అవుననే అనిపిస్తోంది.  జగన్.. తన పాదయాత్రకు రూట్ మ్యాప్ ప్రకటించారు.. నియోజకవర్గాల వారీగా పర్యటిస్తానని క్లారిటీతో చెప్పారు కదా.. మరి గందరగోళం ఎక్కడ నెలకొంది.. ఇదే కదా మీ అనుమానం. జగన్ చేసే పాదయాత్రలో ఎక్కడా గందరగోళం లేదు. కానీ..  పాదయాత్ర చేస్తారా లేదా అనే దానిపైనే గందరగోళం మొదలైంది.

విషయం ఏమిటంటే.. ‘‘రాష్ట్రంలో ఎవరు పాదయాత్ర చేయాలన్నా.. పర్మిషన్ కచ్చితంగా తీసుకోవాలి’’.. ఇది ప్రభుత్వం, పోలీసుల వాదన. ఈ నిర్ణయానికి పోలీసులు కట్టుబడి ఉన్నారు కాబట్టే.. ఇప్పటివరకు ముద్రగడ తాను చేయాలనుకున్న పాదయాత్రను చేయలేకపోయారు. ఇక జగన్ విషయానికి వస్తే..  అసలు పాదయాత్రకు పర్మిషన్ అవసరం లేదు అనేది వైసీపీ నేతల వాదన. గతంలో చంద్రాబు పాదయాత్ర చేసినప్పుడు ఎవరి దగ్గరా అనుమతి తీసుకోలేదు కదా..? మరి తమ అధినేత మాత్రం ఎందుకు తీసుకోవాలి.. అని ప్రశ్నిస్తున్నారు. తాజాగా శుక్రవారం పాదయాత్ర ప్రోగ్రామింగ్ డైరెక్టర్ తలసిల రఘురాం మాట్లాడుతూ కూడా తాము పాదయాత్రకు అనుమతి తీసుకోమని తేల్చి చెప్పారు. ఒకవిధంగా చూస్తే.. వారి ఆలోచన కరక్టే. కానీ ఇప్పుడు   అధికారంలో ఉంది టీడీపీ ప్రభుత్వం కాబట్టి. వారు చెప్పినట్టు వినాలి లేకపోతే.. మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది.

అసలు వైసీపీ నేతలు.. జగన్ పాదయాత్ర గురించి పోలీసులకు చెప్పలేదా..? అంటే చెప్పారు. జగన్ వ్యక్తిగత సెక్రటరీ.. కృష్ణమోహన్ రెడ్డి డీజీపికి లేఖ రాశారు. కానీ ఆ లేఖలో పాదయాత్రకు అనుమతి ఇవ్వండి అనే ముక్క ఎక్కడా లేదు. కేవలం తమ అధినేత పాదయాత్ర చేస్తున్నారు... సెక్యురిటీ కావాలని కోరారు. అంతేకాకుండా  పాదయాత్ర రూట్ మ్యాప్ లను జిల్లాల నేతలు లోకల్ పోలీసులకు అందచేస్తారని కూడా చెప్పారు. పాదయాత్ర ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, ఎక్కడ నుండి ప్రారంభమవుతోంది లాంటి వివరాలను లేఖలో ప్రస్తావించారు. అంతేకానీ అనుమతి కోరలేదు.

 

జగన్ .. అనుమతి కోరకపోతే.. పాదయాత్ర మొదలుపెట్టే సమయానికి పోలీసులు అడ్డుకుంటే...? ఇదే అనుమానం ప్రస్తుతం అందరిలోనూ మొదలైంది. అనుమతి అడిగాక.. వాళ్లు ఇస్తారా? ఇవ్వరా? అనేది సెకండరీ. ముందు అడిగి చూడాలికదా? 

ఒకవేళ జగన్ పాదయాత్రను ఆపేస్తే.. తమ ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుందని చంద్రబాబు భావిస్తే.. పోలీసులు కూడా మారుమాట్లాడకుండా పాదయాత్రకు అడ్డు చెప్పరు. అలాకాదని... అనుమతి తీసుకోవాల్సిందే అని పట్టుపడితే మాత్రం.. పాదయాత్రకు  ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో అందరిలోనూ గందరగోళం నెలకొంది.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !