దారుణం...పిల్లలతో టాయ్ లెట్ క్లీన్ చేయించారు

Published : Feb 17, 2018, 03:00 PM ISTUpdated : Mar 24, 2018, 12:05 PM IST
దారుణం...పిల్లలతో టాయ్ లెట్ క్లీన్ చేయించారు

సారాంశం

టాయ్ లెట్లు శుభ్రంగా లేవని.. విద్యార్థినులతోనే క్లీన్ చేయించారు

పిల్లలకు పాఠాలు నేర్పాల్సిన టీచర్లే.. దారుణంగా వ్యవహరించారు. టాయ్ లెట్లు శుభ్రంగా లేవని.. విద్యార్థినులతోనే క్లీన్ చేయించారు. ఈ దారుణమైన సంఘటన గుర్గావ్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పాఠశాలలోని టాయ్ లెట్లు గత కొంతకాలంగా శుభ్రతకు నోచుకోలేదు. దీంతో భరించలేని దుర్వాసన వస్తున్నాయి. ఇదే విషయాన్ని పాఠశాల విద్యార్థినులు టీచర్లకు చెప్పారు.

వెంటనే స్వీపర్లతో క్లీన్ చేయించాల్సిన టీచరమ్మలు..  పిల్లలనే టాయ్ లెట్ శుభ్రం చేయమని చెప్పడం గమనార్హం. దీంతో చేసేదేమీ లేక ఆ చిన్నారులు టాయ్ లెట్ ని క్లీన్ చేశారు. ఈ విషయాన్ని  చిన్నారుల్లో ఒకరు వారి తల్లిదండ్రులకు చెప్పడం తో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై తల్లిదండ్రులు టీచర్లను ప్రశ్నించగా.. వారు సరిగా స్పందించకపోలేదు. ఒకరు తాము అలా చేయించలేదని కప్పిపుచ్చగా.. మరొకరేమో.. టాయ్ లెట్ శుభ్రం చేయించడం తప్పు ఎలా అవుతుందని ఎదురు ప్రశ్నిస్తున్నారు. కాగా.. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న తల్లిదండ్రులు మాత్రం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరుగుతోంది.

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu