వృద్ధురాలిని తోసేసిన చంద్రబాబు

Published : Nov 05, 2017, 12:29 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
వృద్ధురాలిని తోసేసిన చంద్రబాబు

సారాంశం

ముసలావిడ పట్ల అమానుషంగా ప్రవర్తించిన చంద్రబాబు అడ్డుగా ఉందంటూ తోసేసిన చంద్రబాబు

ఓ వృద్ధురాలి పట్ల.. చంద్రబాబు అమానుషంగా ప్రవర్తించారు. తన సమస్య చెప్పుకోవాలని వచ్చిన పెద్దావిడతో మాట్లాడకపోగా..ఆమెను పక్కకు తోసివేశారు. అసలేం జరిగిందంటే.. శనివారం  తిరుపతి ఎస్వీయూలోని  ఆడిటోరియంలో ఎన్జీవోల సంఘం మహాసభలు జరిగాయి. ఈ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కార్యక్రమం ముగిసిన తర్వాత.. బయటకు వస్తున్న చంద్రబాబుకి ఒక ముసలావిడ ఎదురైంది. ఆమె తన కష్టాన్ని సీఎం కి చెప్పడానికి అక్కడికి వచ్చారు. చంద్రబాబు కనపడగానే ఆ పెద్దావిడ నమస్కారం కూడా చేసింది. వెంటనే చంద్రబాబు ఆమెతో కాసేపు మాట్లాడతారని భావించారు. కానీ.. అలా జరగలేదు. తాను వెళ్తుంటే అడ్డంగా వచ్చిందనే కారణంతో ఆమె వైపు కోపం చూశాడు. అనంతరం ఆమెను పక్కకు నెట్టేసి ఆయన వెళ్లిపోయాడు. అక్కడ జరిగిన సంఘటతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. సమస్య చెప్పుకోవడానికి వస్తే.. సమస్యేంటో తెలుసుకోకుండా పక్కకు నెట్టేయడంతో.. ఆ పెద్దావిడ కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం అక్కడి నుంచి మౌనంగా వెళ్లిపోయారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !