
అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులందుకుంటున్న ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడికి మరొక ఉన్నత స్థాయి గౌరవం దక్కింది. ఆయనే ఇండియాలో నెంబర్ వన్ సిఎం. ఈసారి గుర్తింపు అస్తుల్లో వచ్చింది. ఇండియాలో సంపదలో ఆయన్నుమించిన మొనగాడు లేడు. ఆయన దరిదాపుల్లో ఎవరూ లేరు. 'ఇండియా టుడే' తాజా సంచికలో భారత దేశ ముఖ్యమంత్రులలో సంపన్నులెవరూ, పేదవాళ్లెవరో లెక్క కట్టారు.
ఇండియా టుడే అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రు. 177 కోట్లు. దీనితో ఆయన నెంబర్ వన్ అయ్యారు. ఆ తర్వత 129 కోట్లరుపాయలతో మారుమూల ఈ శాన్య భారతం అరుణాచల్ ప్రదేశ్ సిఎం ప్రేమ ఖండు (బిజెపి) రెండో స్థానంలో నిలబడ్డారు. మూడవ స్థానంలో నిలబడ్డ పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆస్తి రు.48 కోట్లు. హిమాచల్‌ప్రదేశ్ సిఎం వీరభద్ర సింగ్ (కాంగ్రెస్) లో నాలుగవ స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తి రు. 34 కోట్లు. మొదటి సారి ముఖ్యమంత్రి అయిన తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఏ కూడా సంపన్నుడే.ఆయన ఆస్తి రు. 15 కోట్లు. ర్యాంకు అయిదు.
పేద ముఖ్యమంత్రుల విషయాన్ని కొస్తే త్రిపుర సిపిఎం ముఖ్యమంత్రి అస్తి కేవలం 26 లక్షలు. తర్వాత మమతా బెనర్జీ (బెంగాల్ రు. 30 లక్షలు), మెహబూబా ముఫ్తి ( జమ్ము కాశ్మీర్ 55 లక్షలు), మనోహర్ లాల్ ఖట్టర్ (హర్యానా రు.61 లక్షలు) రఘబర్ దాస్ ( జార్ఖండ్, బిజెపి రు.72 లక్షలు), యోగి ఆదిత్యనాథ్ (బిజెపి, ఉత్తర ప్రదేశ్ రు. 72 లక్షలు).
177 కోట్ల ఆస్తి ఉన్నా చంద్రబాబు నాయుడు ఎక్కడా ఆ దర్పం ప్రదర్శించరు. పెద్ద కార్లు లేవు. ఎపుడో పాతకారు ఉంచుకున్నారు. చేతికి వాచీ ఉండదు. జేబిలో నోట్లకట్టలు కాదు గదా ఒక పైసా పెట్టుకోరు. (మరి కార్డో?) రాష్ట్రాన్ని 2051 నాటికి ప్రపంచంలో నెంబర్ వన్ చేయాలన్న ఏకైక లక్ష్యంతో ముందుకు సాగిపోతున్న ముఖ్యమంత్రి. ఈ క్రమంలో ఆయన నెంబర్ వన్ అయ్యారు. ఇంట గెలిచాకే కదా ప్రపంచంలో గెలిచేది... ఆయనను తననెందుకు నిప్పులాంటి మనిషి పిలుచుకుంటారో ఇపుడర్థమయింది కదా...