వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త

First Published Dec 28, 2017, 5:40 PM IST
Highlights
  • వంట గ్యాస్ ధర ఇక నెలనెలా పెరగదు
  • ప్రకటించిన ప్రభుత్వ ఉన్నత వర్గాలు

వంట గ్యాస్ వినియోగదారులకు ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. వంట గ్యాస్ ధరలను నెల నెలా పెంచాలనే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ విషయాన్ని ప్రభుత్వ ఉన్నత వర్గాలు స్వయంగా వెల్లడించాయి.

వంటగ్యాస్‌పై ఇచ్చే రాయితీని పూర్తిగా తొలగించేందుకు నెలవారీగా ధరలను పెంచాలని గతంలో కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంలో భాగంగానే గతేడాది జూన్‌ నుంచి ప్రతి నెలా రూ. 2 చొప్పున పెంచుతూ వచ్చారు. అయితే ఈ ఏడాది జూన్‌లో ఆ పెంపును రెట్టింపు చేస్తూ.. నెల నెలా రూ. 4 చొప్పున సిలిండర్‌ ధరను పెంచుతూ వస్తున్నారు.

అయితే ఈ నిర్ణయం వల్ల ప్రజల్లోకి వ్యతిరేక సంకేతాలు వెళ్తున్నాయని కేంద్రం భావించింది. దీంతో పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘‘ఉజ్వల పథకం’’ కింద పేద ప్రజలకు కేంద్రం ఉచిత గ్యాస్‌ కనెక్షన్లను అందిస్తోంది. అయితే ఉచితంగా కనెక్షన్లు ఇస్తున్నప్పుడు నెలనెలా వంటగ్యాస్‌ ధరలను పెంచడం సరికాదని కేంద్రం అభిప్రాయపడిందని.. దీంతో ధరల పెంపును ఉపసంహరించుకున్నట్లు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

click me!