అక్కడ మగవారికి మాత్రమే బిల్లు వాచిపోతది..!

First Published Aug 8, 2017, 3:29 PM IST
Highlights
  • పురుషులకైతే.. మరీ ఎక్కువ బిల్లు
  • పురుషులకు 18శాతం ఎక్కువ బిల్లు  వేస్తారట

 

సాధారణంగా మనం కాఫీ షాప్ కి వెళ్లామనుకోండి.. అక్కడ ఉండే కాఫీలోని రకాలను బట్టి.. వాటి ధర నిర్ణయించి ఉంటుంది. అదే ఆ కాఫీ షాపు లో ఏసీలు ఉండి... మంచి డిమాండ్ ఉన్న ప్రాంతంలో ఉన్నట్లయితే.. అన్ని కాఫీ షాపుల్లో కన్నా.. ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ.. వచ్చే మనుషులను బట్టి.. బిల్లు ఇవ్వడం గురించి ఎప్పుడైనా విన్నారా.. అందులోనూ పురుషులకైతే.. మరీ ఎక్కువ బిల్లు వేయడం గురించి తెలుసా.. ఇలాంటి కాఫీ షాపులు కూడా ఉంటాయా అనుకుంటున్నారా.. ఆస్ట్రేలియాలో ఇలాంటిదే ఉంది.

ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో ‘హ్యాండ్సమ్ హర్’ అనే ఒక కాఫీ షాపు ఉంది. అందులో కాఫీ చాల బాగుంటుందట కూడా. కాకపోతే అందులో లింగ వివక్ష చూపిస్తున్నారు.ఆ షాపులో కాఫీ తాగడానికి వెళ్లిన వారిలో.. మహిళల కన్నా.. పురుషులకు 18శాతం ఎక్కువ బిల్లు  వేస్తారట. అవా వారి వద్ద నుంచి వసూలు చేసిన ఎక్కువ మొత్తాన్ని మహిళల సేవలకు ఉపయోగిస్తారట.  కానీ.. గౌరవం మాత్రం మహిళలకు, పురుషులకు సమానంగా ఇస్తారట. అంతేకాదు.. కాఫీ షాపులో కూర్చునేందుకు ప్రయార్టీ కూడా ముందు మహిళలకేనట. ఈ షాపుకు లోపలికి అడుగుపెట్టగానే.. కొన్ని రూల్స్ రాసిన నల్ల బోర్డ్ అక్కడ ఉంటుంది. దానిపై పై వివరాలన్నీ రాసి ఉంటాయి. ఆ రూల్స్ నచ్చితేనే కాఫీ తాగొచ్చు.

కాఫీ తాగిన తర్వాత బిల్లు ఎక్కవుగా వేశారంటీ.. అని ఒక వేళ పురుషులు అడిగితే.. లేదా.. వారికి 18శాతం ఎక్కువగా డబ్బు కట్టడం ఇష్టం లేకపోతే.. అసలు బిల్లు ఎంతో అంతే కట్టవచ్చని ఆ షాపు యజమాని చెబుతున్నారు.అయితే.. ఆ షాపు కి వచ్చే పురుషులు ఎవరూ.. అలా ప్రశ్నించడం లేదట.. బిల్లు 18శాతం ఎక్కువ వేసినా కడుతున్నారట. అంతేకాదు.. ఇలా చేయడానికి బలమైన కారణమే ఉందట.. అక్కడ పురుషుల జీతం.. మహిళల జీతాలలో 18శాతం వ్యత్యాసం ఉందట. దాన్ని కాఫీ షాపు గుంజేస్తోంది.

click me!